Game of Thrones in Telugu: గేమ్ ఆఫ్ త్రోన్స్ అన్నది డేవిడ్ బెనియాఫ్, డి.బి.వైస్ సృష్టించిన అమెరికన్ ఫేంటసీ డ్రామా టీవీ సీరీస్. జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ రాసిన ఫాంటసీ నవలల సీరీస్ ని స్వీకరించి ఈ టీవీ సీరీస్ తీశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా చూసిన TV సీరీస్ అమెరికా వ్యాప్తంగా హెచ్.బి.వో. చానెల్లో 2011 ఏప్రిల్ 17 నుండి ఆరో సీజన్ 2016 జూన్ 26న ముగిసింది. సీరీస్ లో 7వ సీజన్ 2017 జూలై 16 నుంచి 2018లో ఎనిమిదవ సీజన్ తో సీరీస్ ముగిసింది.

వెస్టెరోస్, ఎస్సోస్ అన్న కల్పిత ఖండాల్లో జరిగినట్టు ఏర్పాటుచేసిన గేమ్ ఆఫ్ త్రోన్స్ కథనంలో అనేక అద్భుతమైన కథాంశాలు, భారీ తారాగణం ఉన్నాయి. ఇందులో హింస శృంగారం పాలు కాస్త ఎక్కువే. మొదటి కథా క్రమం ఏడు రాజ్యాల సింహాసనం (ఐరన్ త్రోన్) కోసం వివాదించే హక్కుదార్లు, సింహాసనం నుంచి స్వాతంత్రం, సార్వభౌమత్వం కోసం పోరాడే సామంతులతో కలిసివుంటుంది. రెండో కథా క్రమంలో సింహాసన భ్రష్టులైన పూర్వ రాజవంశానికి సంబంధించిన వారసుల్లో మిగిలినవారు ప్రవాసంలో జీవిస్తూ సింహసనాన్ని తిరిగి పొందాలని చేసే ప్రయత్నాలు ఉంటాయి. మూడోదానిలో ప్రమాదకరమైన చలికాలం వస్తూండడం, ఉత్తరాదికి చెందిన భయంకరమైన వింత జీవులు, ప్రచండమైన మనుషుల ప్రమాదం ముంచుకురావడం సాగుతుంటుంది.

గేమ్ ఆఫ్ త్రోన్స్ హెచ్.బి.వో. చానెల్ లో రికార్డు స్థాయిలో వీక్షకులను పొంది, అంతర్జాతీయంగా అశేష ప్రజాదరణ పొంది విశేషంగా అభిమానులను ఆకట్టుకొంది. నటన, సంక్లిష్టమైన పాత్రలు, కథ, విస్తృతికి అవకాశం, నిర్మాణ విలువలు వంటివాటికి విమర్శకుల ప్రశంసలు పొందింది. మరోవైపు సీరీస్ లో నగ్నత, హింస (లైంగిక హింసతో సహా) చూపడం వల్ల విమర్శల పాలైంది. అత్యుత్తమ డ్రామా సీరీస్ పురస్కారాలు (2015, 16 సంవత్సరాలకు గాను) సహా సీరీస్ 38 ప్రైమ్ టైమ్ ఎమ్మా పురస్కారాలు పొందింది. స్క్రిప్ట్ ఆధారితమైన ప్రైమ్ టైమ్ సీరీస్ ల్లో ఇదే అతిఎక్కువ పురస్కారాలు పొందింది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో అత్యుత్తమ టెలివిజన్ సీరీస్ – డ్రామాకు నాలుగు నామినేషన్లు (2012, 2015, 2016, 2017) పొందింది. తారాగణంలో టైరియన్ లానిస్టర్ పాత్రలో పీటర్ డింక్లిజ్ నటనకు గాను రెండు ప్రైమ్ టైమ్ ఎమ్మీ పురస్కారాల్లో అత్యుత్తమ సహాయ నటుడు (డ్రామా) పురస్కారం (2011, 2015), 2012లో గోల్డెన్ గ్లోబ్ ఉత్తమ సహాయ నటుడు (సీరీస్, టెలివిజన్ ఫిల్మ్) పురస్కారం అందుకున్నారు. లీనా హేడే, ఎమిలియా క్లార్క్, కిట్ హారింగ్టన్, మైసీ విలియమ్స్, డయానా రిగ్, మాక్స్ వాన్ సిడో సీరీస్ లో వారి నటనకు ప్రైమ్ టైమ్ ఎమ్మీ పురస్కారం నామినేషన్లు పొందారు.
కధ ఏమిటంటే వెస్టెరోస్ కాల్పనిక ఖండంలోని ఏడు రాజ్యాలు, మరో కాల్పనిక ఖండమైన ఎసోస్ లో జరిగే కథాంశం గేమ్ ఆఫ్ త్రోన్స్ సీరీస్ రాజ్యానికి చెందిన రాజవంశీకుల మధ్య సింహాసనం కోసం పోరాటాన్ని, మిగతా కుటుంబాలు దాని నుంచి స్వాతంత్రం కోసం పోరాటాన్ని చేయడం చిత్రీకరిస్తుంది. మంచుతో గడ్డకట్టుకుపోయిన ఉత్తరం, తూర్పున ఎసోస్ ప్రాంతాల నుంచి అదనపు ప్రమాదాలు దీంట్లో పొడసూపుతూంటాయి.

మాయ మంత్రజాలాలకు తక్కువ ప్రధాన్యత, యుద్ధాలకు, రాజకీయ తంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు . జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ కథను సమకాలీన ఫాంటసీలా కాక చారిత్రిక కల్పనలా అనిపించేందుకు ప్రయత్నించారు విధం. ఎపిక్ ఫాంటసీ జాన్రాలో మాయాజాలాన్ని కొంతవరకే ఉపయోగించాలన్న దృక్పథంతో ఇలా చేశారు.
మంచి-చెడుల మధ్య పోరాటం అన్నది ఫాంటసీ జాన్రాలో సాధారణమైన థీమ్, కానీ అది నిజజీవితానికి ప్రతిబింబం కాదంటాడు రచయిత మార్టిన్. నిజజీవితంలో మంచిగానూ, దుర్మార్గంగానూ కూడా అదే మనిషి ఉండగలిగినట్టుగా, విముక్తి గురించి ప్రశ్నలు, పాత్రల మార్పుల గురించీ మార్టిన్ అన్వేషించసాగాడు చాలా ఫేంటసీలకు భిన్నంగా ఈ సీరీస్ వివిధ పాత్రలను వాటి వాటి దృక్కోణాల నుంచి చూసేందుకు వీలిస్తుంది. కాబట్టి ప్రతినాయకులు కూడా కథను వారి వైపు నుంచి చెప్పే వీలు దొరుకుతుంది.
ఈ వెబ్ సిరీస్‌లో ఉండే జాన్ స్నో(Jon Snow), ఆర్య స్టార్క్ (Arya Stark), ది గ్రేట్ ఖలీసీ (The Great Khaleesi) వంటి క్యారెక్టర్‌లకు ఉన్న పాపులారిటీ వేరే ఏ వెబ్ సిరీస్‌లో ఇంతవరకు చూసి ఉండం. అంతగా ఫేమస్ అయింది గేమ్ ఆఫ్ థ్రోన్స్.
పాపులర్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఎనిమిది సీజన్లు ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) లో అందుబాటులోకి రానుంది. భారత్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ఓటీటీలో ఎనిమిది సీజన్లు ఈ కొత్త టెక్నాలజీ సపోర్ట్‌తో స్ట్రీమ్ కానున్నాయి. అంటే ఆగస్టులో 4కే డాల్బీ సపోర్ట్‌తో గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడవచ్చన్న మాట. అయితే డాల్బీ సపోర్ట్ లేకుండా ప్రస్తుతం కూడా ఈ సీజన్లు డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇప్పటివరకు ఈ సిరీస్ ఇంగ్లీష్ భాషలో మాత్రమే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా(JIO Cinema)లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా ఈ సిరీస్ ఇండియన్ భాషల్లో జియో సినిమా విడుదల చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఇదే కనుక నిజమైతే గాట్ (GOT) ఫ్యాన్స్‌కు పండగ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సిరీస్ చుడనివారు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ తదితర భారతీయ భాషల్లో చుడటానికి అవకాశం ఉంటుంది. అయితే దీనిపై జియో నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సిరీస్‌ను భారతీయ భాషల్లో జియో ఎప్పుడు అనౌన్స్ చేస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.