Ardhangi: జెమినీ టీవీలో సరికొత్త సీరియల్స్ ఒకటి తర్వాత ఒకటికి క్యు కట్టాయి.. జెమినీ టీవీలో అతి త్వరలోనే మరో సరికొత్త సీరియల్ రానుంది అదే అర్ధాంగి.. ఈ సీరియల్ తమిళ్ ఛానల్ లో ప్రసారమవుతున్న ఆనందరాగం సీరియల్ కి రీమేక్ అని తెలుస్తోంది.. మరాఠీ భాషలో ఇదివరకే ఈ సీరియల్ కొనసాగుతోంది.. కన్నడ భాషలో కూడా ఈ సీరియల్ ఆనంద రాగ అనే పేరుతో త్వరలోనే రానుంది.. మలయాళ భాషలో కూడా ఈ సీరియల్ ని రీమిక్స్ చేయబోతున్నారు ఎన్ని భాషలలో ప్రమోట్ చేస్తున్నారంటే ఈ సీరియల్ కి ఎంత పాపులారిటీ ఉందో అదే విధంగా కథనం పరంగా ఎంత స్ట్రాంగ్ కంటెంట్ అయి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

ఈ సీరియల్ ఈశ్వరికి పాత్రలో కన్నడ స్టార్ వైష్ణవి నటిస్తోంది. ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తోంది ఈ అమ్మడు. తండ్రిగా బబ్లు పృధ్వీరాజ్ నటిస్తున్నారు. ఈయన పెళ్లి సినిమాలో బాగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ లో నిహారిక కూడా నటిస్తున్నారు. నిహారిక ఇప్పటికే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించారు. వీళ్ళిద్దరూ గెస్ట్ అపీరియన్స్ రోల్స్ లో నటించనున్నారని సమాచారం.

ఇక ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో హరిత నటిస్తోంది. ఇప్పటికే హరిత బుల్లితెర అమ్మగా పేరు సంపాదించుకుంది. కథ, కథనం ఎలా ఉన్నా కానీ వాటికి జీవం పోయడం హరిత నైజం. అర్ధాంగి సీరియల్లో హీరోకి తల్లిగా హరిత నటిస్తోంది.. ఇక హీరో ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.. అమ్మ మాట జవదాటని సుగుణాల రాముడికి చూడ చక్కని జంట కోసం పెళ్లి సంబంధాలు వెతకమని పంతులు గారికి చెబుతుంది హరిత ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో నా కొడుకుకి సరిపోయే వదువే ఉండదు అని హరిత అంటుంది. సమస్య ఏదైనా సరే క్షణాల్లో చిరునవ్వుతో పరిష్కారం చెప్పే ఈశ్వరికి తగిన జోడి హరిత కొడుకే అవుతాడా అనేదే అసలు కథ కానుంది. ఈ సీరియల్ మార్చి 27 నుంచి జెమినీ టీవీలో ప్రసారం కానుంది..