మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్ ఇది. ఇందులో సత్యదేవ్ విలన్‌గా నటిస్తే.. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
తమన్ స్వరాలు అందించాడు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రం దసరా పండగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఓవైపు వరుస అప్డేట్స్, మరోవైపు ప్రచార కార్యక్రమాలతో సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా `గాడ్ ఫాదర్` ట్రైలర్‌ను బయటకు వదిలారు. `మంచోళ్లందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక. అన్ని రంగులు మారుతాయి..` అంటూ బ్యాగ్‌గ్రైండ్‌లో పూరీ జగన్నాథ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. చిరు తనదైన పర్ఫామెన్స్‌తో పూనకాలు తెప్పించాడు.
`లూసిఫర్`కు రీమేక్ అయినప్పటికీ.. సోల్ మీస్ అవ్వకుండా `గాడ్ ఫాదర్` చాలా మార్పలు చేశారని ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది. `రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు`, `నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను` అంటూ చిరు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.