21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

GodFather: రాయలసీమకి ఎప్పుడొచ్చినా వర్షం కురుస్తూనే ఉంటది చిరు సంచలన వ్యాఖ్యలు..!

Share

GodFather: మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో జరిగింది. ఈ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. అయితే ఒక్కసారిగా కార్యక్రమం జరుగుతున్న సమయంలో భారీ వర్షం పడటం జరిగింది. వర్షం పడుతున్న గాని అభిమానులు ఎవరూ కూడా వెళ్లిపోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అయితే వర్షంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాయలసీమకి నేనెప్పుడొచ్చినా నేల తడుస్తూనే ఉంటది.

GodFather pre release event chiranjeevi speech
GodFather pre release event

నిజంగా ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతకుముందు రాజకీయాల్లో భాగంగా ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా వర్షం పడింది. ఇంకా “ఇంద్ర” సినిమాలో వర్షం పాట సమయంలోను.. వర్షం కురవటం జరిగింది. అయితే ఇప్పుడు కూడా వర్షం కురవడం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాను. థాంక్యూ వరుణ దేవా థాంక్యూ సో మచ్. ఇంకా సినిమా గురించి అనేక విషయాలు చిరంజీవి తెలియజేయడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి..మహేష్ తల్లి ఇందిరా దేవి మరణం పట్ల.. చిరంజీవి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

GodFather pre release event chiranjeevi speech
GodFather pre release event

అక్టోబర్ 5వ తారీఖు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నారు. సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాథ్, సునీల్, సల్మాన్ ఖాన్.. తదితర నటీనటులు నటించారు. తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5వ తారీఖు దసరా పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఆచార్య పరాజయం పాలు కావడంతో “గాడ్ ఫాదర్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

Pawan Kalyan: ఆ రెండు వేరు.. టాలీవుడ్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Ram

నరసింహ నాయుడు సెంటిమెంట్‌తో బాలయ్య.. హిట్ కొట్టడం ఖాయం..!

Ram

Anushka Shetty New Pictures

Gallery Desk