21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

`గాడ్ ఫాద‌ర్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ లాక్‌.. ఎప్పుడు? ఎక్క‌డ‌?

Share

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లో `గాడ్ ఫాదర్` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. మలయాళ సూప‌ర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న తెలుగుతో పాటు హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

chiranjeevi godfather movie
chiranjeevi godfather movie

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మేక‌ర్స్ డేట్ లాక్ చేశారు. ఈ నెల 28న గాడ్ ఫాద‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతోంది. అయితే, హైదరాబాద్ బదులు అనంతపురంను మేక‌ర్స్ ఎంచుకోవ‌డం విశేషం.

అవును, అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో సెప్టెంబ‌ర్ 28న సాయంత్రం 6 గంట‌ల నుంచి ఈ వేడుక నిర్వహిస్తామని ఇంతకు ముందే చిత్ర టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే ఈ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా షురూ చేశారు. దీంతో ఏపీలోని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

https://twitter.com/KonidelaPro/status/1573937299615715329?s=20&t=_Kx6mHPo89BYUtYyCjhh_w

 


Share

Related posts

Dj Tillu: `డీజే టిల్లు` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేశాడుగా!

kavya N

Urvashi Rautela With superstar Rajinikanth Photos

Gallery Desk

GodFather: చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చరణ్ చెప్పడం వల్లే “గాడ్ ఫాదర్” సినిమా చేశా..!

sekhar