Waltair Veerayya: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోల కంటే మంచి స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. ఏప్రిల్ నెలలో “ఆచార్య”, అక్టోబర్ నెలలో “గాడ్ ఫాదర్” రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండిటిలో “గాడ్ ఫాదర్” సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు డైరెక్టర్ భారీ దర్శకత్వంలో చేస్తున్న “వాల్తేరు వీరయ్య” సంక్రాంతి పండుగ బరిలో దింపడానికి రెడీ అయ్యారు.
తాజాగా జనవరి 13వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు… మూవీ టీం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన బాస్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా బాలకృష్ణ వేరసింహారెడ్డి జనవరి 12వ తారీకు విడుదల ప్రకటించగా ఆ తర్వాత రోజే జనవరి 13వ తారీకు చిరంజీవి “వాల్తేరు వీరయ్య” రిలీజ్ కావటంతో ఇద్దరి మధ్య చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద టాఫ్ ఫైట్ నెలకొంది. ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ హిట్టు కొడతాడు.
మరి ఈసారి సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. మరోపక్క “వాల్తేరు వీరయ్య” లో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ నటించడం విశేషం. త్వరలోనే రవితేజ లుక్ వీడియో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల మూడో వారం నుండి “వాల్తేరు వీరయ్య” ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఫుల్ మాస్ పాత్రలో చిరంజీవి కనిపిస్తున్నారు. గతంలో వీరద్దరి కాంబినేషన్ లో అన్నయ, శంకర్ దాదా జిందాబాద్ రావడం జరిగింది. “అన్నయ” చిరంజీవి తమ్ముడుగా రవితేజ నటించడం జరిగింది. మళ్లి చాల కాలం తర్వాత చిరు సినిమాలో రవితేజ నటించడం విశేషం.