Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ ఇటీవలె `రాధేశ్యామ్`తో పలకరించాడు. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ వింటేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి.
`కేజీఎఫ్`తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై హై బడ్జెట్‌తో విజయ కిరాగందుర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసే గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వాస్తవానికి గత కొద్ది నెలల నుంచీ సలార్ టీజర్ కోసం అభిమానులు ఎంతో అతృతగా వెయిట్ చేస్తున్నారు. దాంతో మే ఆఖరి వారంలో టీజర్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.
కానీ, అది జరగలేదు. షూటింగ్ ఆలస్యం కావడంలో నిర్ణీత సమయానికి టీజర్‌ను విడుదల చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చిందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. జులై రెండు లేదా మూడో వారంలో టీజర్ విడుదల కాబోతోందని, ఇందుకు సంబంధించిన అప్డేట్ను త్వరలోనే మేకర్స్ నుంచి రివిల్ కానుందని అంటున్నారు.