NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Yatra 2 Teaser: “యాత్ర 2” టీజర్ వచ్చేసింది.. వైయస్ అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

Yatra 2: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న చివరి ముఖ్యమంత్రి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే ఆనాడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆయన చేసిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి రైతు బంధవుడుగా.. అనేక హామీలు ఇచ్చి 2004లో అధికారంలోకి వచ్చారు. అనంతరం అనేక సంక్షేమ పథకాలు అందించి 2009లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ప్రధాన అంశంగా 2019లో “యాత్ర” అనే సినిమా చేయడం జరిగింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఏపీలో ఎన్నికలకు ముందు విడుదలైన ఈ సినిమా వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చింది.

Good News for YS Fans Yatra movie second part teaser Release

ఇదిలా ఉంటే ఇప్పుడు “యాత్ర 2” తెరకెక్కిన సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైయస్ జగన్ రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు జైలు జీవితం మరియు పాదయాత్ర ఇంకా ముఖ్యమంత్రిగా గెలవడం వంటి అంశాలను ప్రధానంగా చేసుకొని ఈ సినిమా చిత్రీకరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించిన ఇప్పుడు జగన్ పాత్రలో తమిళ్ హీరో జీవా నటించడం జరిగింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ ఇంకా చాలామంది వైఎస్ జగన్ ని కట్టడి చేయటానికి తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు వ్యవహారం మొత్తం ఈ ట్రైలర్ లో చూపించడం జరిగింది. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజరేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నాడ్, వైయస్ భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించడం జరిగింది. ఈ సినిమాని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్.. సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Good News for YS Fans Yatra movie second part teaser Release

“యాత్ర” సినిమా విడుదలైన రోజే అనగా ఫిబ్రవరి 8వ తారీఖు “యాత్ర 2” విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన టీజర్ లో తండ్రి పోయాడనుకుంటే కొడుకు వచ్చాడు అంటూ చంద్రబాబు చెప్పిన డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. మొండివాడైన జగన్ తో యుద్ధం చేయటం మనకే నష్టమంటూ సోనియా గాంధీని.. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పిన ఉదాంతం మొత్తం టీజర్ లో చూపించారు. టీజర్ మొత్తం రెండు గంటల 47 నిమిషాలు ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షనేతగా జగన్ అసెంబ్లీలో చెప్పిన డైలాగులు.. చాలా హైలెట్ గా నిలిచాయి. “యాత్ర 2” టీజర్ వైయస్ అభిమానులకు.. ఒక పండగ అని చెప్పవచ్చు కచ్చితంగా టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జగన్ పాత్రలో జీవా అద్భుతంగా నటించాడు.

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri