Pakka Commercial: `పక్కా కమర్షియల్` క‌లెక్ష‌న్స్‌.. తొలి రోజే గోపీచంద్ న‌యా రికార్డ్‌!

Share

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల భామ రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ పై అల్లు అర‌వింద్‌, బన్నీ వాసు నిర్మించారు.

సత్యరాజ్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ నిన్న ఈ చిత్రం గ్రాండ్ గా విడుద‌లైంది. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

అయితే టాక్ ఎలా ఉన్నా తొలి రోజు ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం స్వ‌యంగా ప్రకటించింది. గోపీచంద్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ నిలిచింద‌ని కూడా మేక‌ర్స్ పేర్కొన్నారు.

గోపీచంద్ గత చిత్రం ‘సీటీమార్’ మొదటి రోజు దాదాపు 4.1 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’తో గోపీచంద్ ఆ రికార్డును బ్రేక్ చేసి.. మ‌రో న‌యా రికార్డ్‌ను న‌మోదు చేశాడు. మ‌రి ఇక‌పై కూడా ఇదే జోరును కొన‌సాగిస్తే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవ‌డం సుల‌భం అవుతుంది.

 


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

36 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

45 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago