గోపీచంద్ అక్క‌డ మిస్ అయినా.. ఇక్క‌డ మిస్ అవ్వ‌డు!

Share

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రీసెంట్‌గా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తే.. సత్యరాజ్, వరలక్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, రావు రమేష్, అజయ్ ఘోష్ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

గీతా ఆర్ట్స్‌-2, యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం జూలై 1న విడుద‌లై.. మిక్స్డ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. డబ్బుల్లేనిదే ఏ పని చేయడు, డబ్బిస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చేసే లక్కీ అనే లాయ‌ర్ పాత్ర‌లో గోపీచంద్ అద‌ర‌గొట్టారు. రాశి ఖ‌న్నా, స‌త్య రాజ్‌, రావు ర‌హేష్ లు ఉన్నంత‌తో బాగా ఆక‌ట్టుకున్నారు. కానీ, రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ లుగా మారాయి.

అయినా స‌రే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అవ్వ‌క‌పోయినా.. డిజాస్టర్ కాకుండా మాగ్జిమం రికవరీ చేయ‌గ‌లిగింది. ఇక‌పోతే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి దిగ‌బోతోంది. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను రెండు ఓటీటీలు సొంతం చేసుకున్నాయి.

అందులో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒక‌టి కాగా.. మరొకటి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా. ఇప్పుడు ఈ రెండు ఓటీటీల్లోనూ ఆగస్టు 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. అయితే గోపీచంద్ థియేట‌ర్స్ లో హిట్ కొట్ట‌డం మిస్ అయినా.. ఓటీటీ మాత్రం మిస్ అవ్వ‌డ‌ని ఆయ‌న అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ మూవీ ఓటీటీ వేదిక‌గా ఏ రేంజ్‌లో స‌క్సెస్ అవుతుందో చూడాలి.

 


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

49 seconds ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

52 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago