Gopichand: గోపీచంద్ ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీ.. ఆ అమ్మాయి ఎందుకు నో చెప్పింది?

Share

Gopichand: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ తొట్టెంపూడి అంటే తెలియ‌ని వారుండ‌రు. రష్యాలో ఇంజనీరింగ్ ను కంప్లీట్ చేసిన ఈయ‌న‌.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కన‌టుడు టి. కృష్ణ మరణాంతరం ఆయ‌న వారసత్వాన్ని కొన‌సాగిస్తూ `తొలి వలపు` మూవీతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. హీరోగా తొలి సినిమా చేశాక గోపీచంద్‌కు విల‌న్ అవ‌కాశాలు వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికీ నిరాశ చెంద‌కుండా వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను సద్వినియోగం చేసుకుంటూ మంచి న‌టుడిగా మార్కులు వేయించుకున్నాడు. యజ్ఞం, ఆంధ్రుడు, ర‌ణం వంటి చిత్రాల‌తో హీరోగా నిల‌దొక్కుకుని.. కెరీర్ ప‌రంగా మంచి జోరు చూపించాడు. అయితే 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ `లౌక్యం` త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ప‌డ‌టంతో ఈయ‌న గ్రాఫ్ డౌన్ అయిపోయింది.

ఇక గ‌త ఎనిమిదేళ్ల నుంచీ స‌క్సెస్ లేక స‌త‌మ‌తం అవుతున్న గోపీచంద్.. ఈసారి ఎలాగైనా స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. నేడు గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక‌పోతే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గోపీచంద్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న ఫెయిల్స‌ర్ ల‌వ్ స్టోరీని అంద‌రితోనూ పంచుకున్నారు. “బీటెక్ చదివే టైమ్ లో ఒక రష్యన్ అమ్మాయి ప్రేమ‌లో ప‌డ్డాను. ఇద్ద‌రూ ఒకే బస్సులో క‌లేజ్ కి వెళ్లేవాళ్లం. పెళ్లి చేసుకుందాం అని అడిగేయాలని అనిపించడంతో ఓ మంచి రోజు చూసుకుని ఆ అమ్మాయిని అడిగేశాను. కానీ, ఆ అమ్మాయి `నా దేశం వేరు నీ దేశం వేరు, మా ఫ్యామిలీ మ‌న పెళ్లికి అంగీక‌రించ‌రు` అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసింది. నేను ఆమె చెప్పిన మాట‌ల‌కు స‌రే అని అన్నాను“ అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చారు. కాగా, గోపీచంద్ సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ సోదరి కుమార్తె అయిన రేష్మా ను 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి విరాట్ కృష్ణ, వియాన్ అనే ఇద్ద‌రు కుమారులు జ‌న్మించారు.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

4 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago