32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News రివ్యూలు

Avatar 2 Movie Review: గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్… మరో విజువల్ వండర్ ట్రీట్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’

Share

Avatar 2 Movie Review: ప్రపంచ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన… వాటర్ విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. 160 భాషలలో విడుదలైన ఈ సినిమా.. గురించి పూర్తిగా తెలుసుకుందాం.

సినిమా పేరు : అవతార్ 2
నటీనటులు : సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగుర్ని వీవర్, కేట్ విన్సెలెట్, స్టెఫాన్ లాంగ్, క్లిఫ్ కర్టీస్, జో డేవిడ్ మూర్ తదితరులు.
డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టోరీ : జేమ్స్ కామెరూన్.
కో ప్రొడ్యూసర్ : జాన్ లాడవు.
మ్యూజిక్ డైరెక్టర్ : సైమాన్ ఫ్రాగ్లెన్.
బ్యానర్ : టీఎస్జీ ఎంటర్ టైన్ మెంట్, లైఫ్ స్ట్రామ్ ఎంటర్ టైన్ మెంట.
విడుదల తేది: డిసెంబర్ 16, 2022.

Great Director James Cameron Avatar 2 Movie Review Details
Great Director James Cameron Avatar 2
పరిచయం:

సినీ ప్రపంచం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న విజువల్ వండర్ “అవతార్ 2” సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలయ్యింది. వరల్డ్ వైడ్ గా 160 భాషలలో విడుదల చేయడం జరిగింది. “అవతార్ 2″కి సంబంధించి టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేయడం జరిగింది. 2009లో వచ్చిన “అవతార్” విజువల్ వండర్ గా అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అల్లరించటం తెలిసిందే. అయితే ఇప్పుడు “అవతార్” సినిమాకి కొనసాగింపుగా జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ త్రీడీలో నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో అల్లరించటం జరిగింది. మొదటి భాగానికి మించి రెండో భాగంలో విజువల్ గ్రాఫిక్ సీన్స్ అదరగొట్టేశాయి. 2009లో వచ్చిన మొదటి పార్ట్ పండోరా గ్రహంపై కథ నడిపిస్తే రెండో భాగం భూ అంతర్భాగంలో నీటిలో… కళ్ళు చెదిరిపోయే విజువల్ వండర్ 3Dలో … అద్భుతమైన వింత ఊహ నీటి ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ కామెరూన్ అద్భుతంగా ఆవిష్కరించారు.

Great Director James Cameron Avatar 2 Movie Review Details
Avatar 2
స్టోరీ:-

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కథ విషయానికొస్తే కచ్చితంగా సినిమా చూసే ప్రేక్షకుడు మొదటి పార్ట్ “అవతార్” చూసిన వ్యక్తి అయితే బాగా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే అవతార్ మొదటి భాగానికి ఇది కొనసాగింపు. మొదటి భాగంలో భూమి నుండి పండోరా గ్రహంలోకి వెళ్లిన ..హీరో జేక్ నావీ తెగ అన్యాయానికి గురికావడం చూసి… ఆ తెగ కోసం అన్యాయాన్ని ఎదిరించడం..ఆ తెగ నాయకుడు కూతురు నేతిరితో … జేక్ ప్రేమలో పడటం జరుగుద్ది. దీంతో నేతిరి…జేక్ కి తమ సాంప్రదాయాలు.. అన్నిటి గురించి.. తెలియజేయడం జరుగుద్ది. ఇక్కడితో అవతార్ మొదటి సినిమా పార్ట్ కంప్లీట్ అవుద్ది. ఇక ఆ తర్వాత స్టోరీ యే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’.

Great Director James Cameron Avatar 2 Movie Review Details
Avatar 2 Movie Review

భార్య నేతిరి తండ్రి వారసత్వాన్ని అందుకుని జేక్ తెగ నాయకుడు అవుతాడు. ఆ తర్వాత పది సంవత్సరాలలో లోక్, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్లలను కన్నడం జరుగుద్ది. ఇక ఇదే సమయంలో జేక్ పిల్లలతో కలిసి జేక్ దంపతులకు దత్త పుత్రిక కిరి, స్పైడర్ అనే మరో బాలుడు కలసి పెరుగుతుంటారు. పరిస్థితి ఇలా ఉంటే భూ ప్రపంచం ప్రమాద పరిస్థితుల్లో ఉందని భూమి నుండి కొంతమంది మనుషులు పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవడానికి వస్తారు. ఈ క్రమంలో నావీ తెగని అంతమొందించడానికి ఆ మనుషులు రకరకాల సాయుధ బలగాలతో దాడులకు పాల్పడుతుంటారు. ఈ దాడులతో జేక్.. తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం కొత్త ప్రాంతం మెట్కయినా దగ్గరికి వెళ్ళటం జరుగుద్ది. మెట్కయినా ప్రాంత వాసులకి సముద్రమే ప్రపంచం. సముద్రంలోనే వారి జీవన విధానం ఉంటుంది. అయితే జేక్ తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం అక్కడ రాజు టోనోవరి… సహాయం పొందుతాడు. అయితే మెట్కయినా ప్రాంతం సముద్ర జీవన విధానంతో కూడినది  కావటంతో కష్టమైనా గాని జేక్ కుటుంబం అక్కడ జీవన విధానం అలవాట్లు అలవర్చుకుంటూ ఉంటది. ఇక ఇదే సమయంలో భూమి నుంచి అసలైన విలన్ మైల్స్ క్వారిచ్(స్టీఫెన్ లాంగ్)… అతడి గ్యాంగ్…తో..జేక్ కుటుంబాన్ని అంతమొందించాలని భావిస్తాడు. అయితే జేక్ వద్ద పెరుగుతున్న దత్త పిల్లలు గురించి మైల్స్ క్వారిచ్ తెలుసుకున్నాక… సినిమా ఏ రీతిగా మలుపు తిరుగుతుంది..? జేక్ పిల్లలతో పెరుగుతున్న స్పైడర్ ఏం చేస్తాడు..? చివరకి ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ.

 

విశ్లేషణ:

“అవతార్” మొదటి భాగం పండోరా గ్రహం మీద కావటంతో రకరకాల జీవరాసులు వింతైన అటవీ ప్రపంచం చుట్టూ సాగుద్ది. కానీ రెండో భాగం నీటి ప్రపంచానికి చెందినది కావటంతో… జేమ్స్ కామెరూన్ అద్భుతమైన ఊహాజనిత నీటి ప్రపంచంలోకి ప్రేక్షకులను త్రీడీలో తీసుకెళ్లాడు. మానవ మనుగడ లేని టైంలో.. మానవ మనుగడ వచ్చిన తర్వాత సముద్రమే అసలైన నివాసం అన్నట్టు… సినిమా స్టోరీ ద్వారా.. అద్భుతమైన వింతైన ఊహా లోకాన్ని సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కించారు. సినిమాలో మొదటి 90 నిమిషాలు మామూలుగా ఉన్నాగాని తర్వాత జేక్ ఫ్యామిలి మెట్కయినా ప్రాంతానికి వెళ్లాక… సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. సముద్ర గర్భంలో మరో అందమైన ప్రపంచాన్ని.. జేమ్స్ కామెరూన్ అద్భుతంగా చూపించారు. సముద్రంలో రకరకాల జలచారులు వాటి జీవితాలు..మనుషులతో వాటి అనుబంధాలు గురించి చూసే ప్రేక్షకులు మనసులను హత్తుకునే రీతిలో తెర మీద చూపించడం జరిగింది. “అవతార్” మొదటి భాగంలో కంటే రెండో భాగంలో.. విజువల్ వండర్ ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. సముద్రంలో మరో కొత్త ప్రపంచాన్ని…‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ద్వారా ఆవిష్కరించారు. ఒకపక్క విజువల్ వండర్ తో వింతైన నీటి ప్రపంచాన్ని చూపిస్తూనే మరోపక్క… కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తండ్రి పడే కష్టాలు…పోరాట సనివేశాలు మరియు భావోద్వేగాలు చూసే ప్రేక్షకులను కట్టిపడేసాయి. ముఖ్యంగా తిమింగలంతో ఫైట్ ఇంకా సముద్ర జీవులు… హీరోకి సహాయం చేసే సన్నివేశాలు చాలా హైలెట్ గా ఉంటాయి. ఇంకా విలన్ మరియు అతడి కొడుకు మధ్య.. వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Great Director James Cameron Avatar 2 Movie Review Details
Great Director James Cameron Avatar 2
ప్లస్ పాయింట్స్:

విజువల్ వండర్ గ్రాఫిక్స్.

స్టోరీలో భావోద్వేగాకర సీన్స్.

టెక్నికల్ వర్క్.

సముద్రంలో వచ్చే సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

సినిమా రన్ టైం (3 గంటల 12 నిమిషాల 10 సెకండ్లు).

రొటీన్ స్టోరీ.

ఓవరాల్ గా:

“అవతార్ 2” సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్. దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన మరో నీటి ప్రపంచం.

రేటింగ్: 3.25/5

Share

Related posts

డిజాస్ట‌ర్‌గా సాయి ప‌ల్ల‌వి `గార్గి`.. ఇంత‌కీ లాసెంతో తెలుసా?

kavya N

ప్రియుడితో కియారా పెళ్లి.. హింట్ ఇచ్చిన స్టార్ హీరో!

kavya N

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ లో నాగ చైతన్య పాత్రపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!

sekhar