Gunde Ninda Gudigantalu November 10 2023 episode 30: తల్లి ప్రభావతి అన్న మాటలకు షాక్ అయిన బాలు అసలు నేను వెళ్లే వద్దనుకుంటున్నాను జీవితంలో పెళ్లి చేసుకోను సత్యం ప్రభావతి ఎందుకు ఇంట్లో పెద్దవాడి పెళ్లి కాకుండా ఆ తరువాత ఆడపిల్ల పెళ్లి కాకుండా రెండవ వాడి పెళ్లి గురించి ఆలోచిస్తున్నావ్. ప్రభావతి మరి ఏం చేయాలి మీరు తెచ్చిన సంబంధం నా కొడుకు మనోజ్ కి నాకు నచ్చలేదు అని చెప్పాను కదా అయినా మీరు వినడం లేదు కదా మీకు సపోర్టుగా నీ రెండవ కొడుకు బాలు ఉన్నాడు కాబట్టి అందుకే వాడిని చేసుకోమంటున్నాను. సత్యం ప్రభావతి నేను చెప్పింది చేస్తాను ఇందులో ఏ మార్పు లేదు. మనోజ్ అలా ఎలా ఒప్పుకుంటాను. సత్యం అయితే వినండి నేను నా రిటైర్మెంట్ ఫండ్ లో నుంచి నాకు కావలసినంత తీసుకువెళ్లి ఆ కుటుంబానికి సహాయం చేస్తాను అలాగే ఆ ఇంటి ఆడ కూతురు పెళ్లి బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు సత్యం.

మీనా కోసం ప్రిన్సిపల్ చెరుకు బండి దగ్గరకు వస్తాడు మీనా అమ్మా మీనా అని పిలుస్తాడు. మీనా ప్రిన్సిపల్ గారు మీరా నేను చూసుకోలేదు సార్ క్షమించండి అంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ అమ్మ మీనా నీవే నన్ను క్షమించాలి. నీ పట్ల నేను అంతా కఠినంగా మాట్లాడిన నీవు నా కూతురు దగ్గర ఆ కఠినత్వాన్ని చూపించకుండా తనని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చావు కాబట్టి నేనే నీకు కృతజ్ఞతలు తెలియజేయాలి తల్లి అంటాడు. మీనా మాతృదేవోభవ అని పితృదేవోభవ అని ఆచార్యదేవోభవ అని ఎన్ని బోధిస్తారు గురువును మించిన దైవం లేదు అని అంటారు

అలాంటి గురువుకి నేను సహాయం చేయడం తప్పులేదు కదా సార్,ఏదో మా తమ్ముడు చేసిన చిన్న తప్పుకి వాడికి చదువు చెప్పను అంటే వాడు సమాజానికి మంచిగాఎలా ఉపయోగపడతాడు సార్ మంచిగా ఎలా మారుతాడు సార్ ప్రిన్సిపాల్ అయ్యో మీనా అదేం లేదమ్మా మీ తమ్ముని రేపటి నుంచి కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్పు అంటాడు.అందుకు మీనా సంతోష పడి అవునా సార్ చాలా సంతోషం సార్ ప్రిన్సిపల్ ఇక నేను వెళ్ళొస్తానమ్మ మీనా అలాగే సార్ వెళ్లి రండి. మనుష్ తన ప్రియురాలు దగ్గరికి వెళ్లి బేబీ మనం ఎలాగైనా ఇప్పుడే పారిపోయి పెళ్లి చేసుకుందాం పద అంటాడు.

అందుకు కల్పన అదేంటి మనోజ్ ఇప్పుడు సడన్లిగా పెళ్లెంటి నీవు బిజినెస్ పెట్టాలి సెటిల్ అవ్వాలి అప్పుడు కదా మన పెళ్లి.మనోజ్ అప్పటిదాకా మా నాన్న ఆగడం లేదు వేరే సంబంధం తీసుకొచ్చి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు అందుకనే మనం ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం కల్పన మనం ఇప్పుడు పెళ్లి చేసుకున్న నీ కళ నెరవేరదు కదా నీవు బిజినెస్ పెట్టలేవు కదా అందుకనే మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు మనోజ్ ఆ తర్వాత మీ నాన్న డబ్బులతో నీవు బిజినెస్ పెట్టుకో లైఫ్ లో సెటిల్ అవుతావు నీవు నా గుండెలోనే ఉంటావు నిన్ను ఎప్పటికీ మరిచిపోలేను అంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది కల్పన. మనోజ్ ఇంటికి వచ్చి తల్లి ప్రభావతిని రెచ్చగొటీ తండ్రి సత్యం దగ్గరికి తీసుకు వస్తాడు. సత్యం ఏంటి ప్రభావతి అబ్బే ఏమీ లేదండి మనోజ్ మీతో ఏదో చెప్పాలంట సత్యం ఏంట్రా మనోజ్ చెప్పు మనోజ్ అదేం లేదు నాన్న అమ్మ మీతో మాట్లాడాలి అంట.

ఎవరో ఒకరు మాట్లాడండి ప్రభావతి మరి అదేం లేదండి మనోజ్ ని పెళ్లి చేసుకోమంటున్నారు కదా వాడికి నచ్చడం లేదు నాకు కూడా నచ్చడం లేదు. సత్యం నచ్చకపోతే వదిలేయండి. ప్రభావతి ఇంత ఈజీగా వదిలేశారా ఇక మీరు ఆ కుటుంబాన్ని వదిలేసినట్టేనా బాధ్యత వదిలేసినట్టేనా. సత్యం మిమ్మల్ని వదిలేయమన్నాను కానీ నా బాధ్యత నేను మర్చిపోతాను అని చెప్పలేదు కదా ప్రభావతి. ప్రభావతి అయితే ఏం చేస్తారు సత్యం నా రిటైర్డ్ ఫండ్ వస్తే అందులో నుంచి సగం ఊర్లో ఉన్న పొలాల్లో నుంచి సగం తీసుకువెళ్లి ఆ ఫ్యామిలీకి ఇస్తాను ఆ తరువాతే మిగిలిన ఆస్తిలో మీ అందరికీ సమానంగా పంచుతాను అంటాడు సత్యం అందుకు ప్రభావతి మనోజ్ షాక్ అవుతారు. ప్రభావతి అదేంటండీ మళ్లీ మీరు మొదటికే వచ్చారు. సత్యం అవును నేను తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మారదు ప్రభావతి.

ప్రభావతి అయితే నా మాట కూడా వినండి నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను,మనోజ్ అవును అమ్మ అసలుకే ఒప్పుకోదు ఈరోజు నుంచి ఇప్పటినుంచే నిరాహార దీక్ష చేస్తుంది. ప్రభావతి ఒరేయ్ మనోజ్ ఏంట్రా ఇలా ఇరికించావు. మనోజ్ ఏం పర్వాలేదమ్మా ప్రభావతి అవును. మీరు ఒప్పుకునేదాకా అన్నా నిరసన ఇలాగే కొనసాగుతుంది. నైట్ అయింది మీనా ఇంటికి వస్తుండగా బాలు తాగేసి రోడ్డుమీద అరుస్తూ ఉంటాడు అది చూసిన మీనా ఈ ముళ్ళకంప మళ్ళీ తాగేసి రోడ్డుమీద ఎలా అరుస్తున్నాడో చూడు చిచి అయినా నాకు వీడుతో పనేంటి అని వెళ్ళిపోతూ ఉండగా హలో పూలగంప ఏంటి ఇంటికి వెళుతున్నావా జాగ్రత్త మీనా నాకు తెలుసు నీవు తప్పుకో అని వెళుతుండగా నలుగురు విలన్సు వచ్చి మీ నా సైకిల్ ని అడ్డుకొని తన చేయి పట్టుకోగానే అది చూసిన బాలు వచ్చి ఆడపిల్ల చేయి పట్టుకోవడం తప్పు కదా అల్లరి చేయొచ్చు కానీ అల్లరి పాలు చేయకూడదు
బ్రదర్స్ దాని పేరు పూల బుట్ట కానీ దాని మాటలు ముళ్ళకంప మాటలే గుచ్చుకునేలా మాట్లాడుతుంది కానీ తప్పదు భరించాలి ఆడవాళ్లు కదా బ్రదర్స్ అలాంటి మాటలు అన్నారని మనం రెచ్చిపోయి ఏదో చేయాలని చూస్తే నాలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా వెళ్లిపోండి అంటాడు బాలు.విలన్స్ ఏ వెళ్ళకపోతే ఏం చేస్తావురా కొడతావా బాలు అబ్బే నేను కొట్టను బ్రదర్స్ చితక్కొడతాను అని వాళ్ళని కొట్టి మీనా తో హలో పూల బుట్ట ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అంటాడు. మీనా ఏ నీవు రాకపోతే ఆ ఫైట్ నేను చేయనా అని అంటుంది మీనా అప్పుడు బాలు నేను కాస్త లేటుగా వచ్చుంటే బాగుండు కాపాడండి కాపాడండి అని నువ్వు అరుస్తున్నప్పుడు వస్తే చాలా బాగుండేది కదా పూల గంప మీనా చి పోరా ముళ్ళకంప అని ఇంటికి వెళ్ళిపోతుంది బాలు పోవే పూల గంప ఇదిగో నీ పువ్వులన్ని తీసుకువెళ్లే అని పువ్వులు మీనా తల మీద పోస్తాడు.
బాలు ఇంటికి వెళ్లి తన తల్లి ప్రభావతి నిరాహార దీక్ష చేయడం చూసి బాగుంది చాలా బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి అంటాడు. ప్రభావతి ఒరే ఆటో వెళ్లరా వెళ్ళు అంటుంది. బాలు వెళతాను కాకపోతే నేను ఒక సలహా ఇస్తాను నిమ్మరసం తాగు లేదంటే నిరాహార దీక్షకు నాన్న తగ్గడుగాక తగ్గడు కరగడుగాక కరగడు అప్పుడు నీకు నీరసం వచ్చి ఆకలి వేసి కాళ్లు చేతులు వణికి కృంగిపోయి కుషించిపోయి ఆఖరికి ఆరోగ్యం కరాబ్ అవుతుంది ప్రభావతి బాలు మాటలకి భయపడుతుంది మనోజ్ అమ్మ నువ్వేమీ భయపడకు నీకు సపోర్టుగా నేనుంటాను అంటాడు మనోజ్ ప్రభావతి వీడు మాత్రం కడుపు నిండా తిన్నాడు కానీ నిరసన మాత్రం నాకు తగిలించాడు అనుకుంటుంది ప్రభావతి