Gunde Ninda Gudigantalu November 16 2023 Episode 34: కామాక్షి ఈ బాలుకి చెబితే నా పైసలు సులువుగా వసూలు అయితాయి అనుకుంటా వీడికి చెప్పి చూద్దామని కామాక్షి బాలు నాకు సహాయం చేసి పెడతావా అంటుంది బాలు చెప్పు కామక్షి అత్త ఏం చేయాలి కామాక్షి సాంబయ్య అని అతను గుడి దగ్గర చెరుకు బండి నడిపిస్తూ ఉంటాడు ఆ సాంబయ్య నా దగ్గర చీటి పాట పాడి లక్ష రూపాయలు తీసుకువెళ్లాడు తీరా చూస్తే అతను ఇప్పటివరకు పైసలు కట్టనే లేదు అందుకని నీవు ఆ చీటీ పైసలు జరా వసూలు చేసుకొచ్చి ఇస్తావా బాలు అంటుంది కామాక్షి బాలు అయ్యో కామాక్షి అత్త అదెంత పని చేసి పెడతాను అంటూ బాలు మీనా చెరుకు బండి దగ్గరికి వెళ్లి ఇక్కడ సాంబయ్య అంటే ఎవరు ఈ చెరుకు బండి సాంబయ్యదేనా అని అడుగుతాడు మీనా అవును ఈ చెరుకు బండి సాంబయ్యదే ఆయన మా నాన్న అని చెబుతోంది బాలు అయితే ముందు చీటీ డబ్బులు కట్టి తర్వాత మాట్లాడు అంటాడు

మీనా చీటీ నా అదేంటి నీ దగ్గర నేను ఎప్పుడు చీటీ పాట పాడాను అంటుంది మీనా బాలునువ్వు కాదు మీ నాన్న సాంబయ్య మా కామాక్షి అత్తయ్య దగ్గర చీటి పాడి లక్ష రూపాయలు తీసుకొని వచ్చాడు మీనా ఆ కామాక్షి ఎవరో నాకు తెలియదు మర్యాదగా నువ్వు చెరుకు బండి దగ్గర నుంచి వెళ్ళిపో అంటుంది అక్కడే ఎదురుగా పువ్వులు అమ్ముతూ ఉన్న మీనా తల్లి పార్వతి వచ్చి అమ్మ మీనా అ కామాక్షి నాకు తెలుసు నాన్నగారు నిజంగానే ఆవిడ దగ్గర చీటీ పాట పాడి డబ్బులు తీసుకువచ్చాడు కానీ నేను ఆ సంగతి మరిచిపోయాను బాబు నీ డబ్బులు నీకు నెల నెల నేను కట్టేస్తాను దయచేసి వెళ్ళిపోండి అంటుంది పార్వతి బాలు వెళ్లిపోతాను నా డబ్బులు ఈనెల వాటా ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంటాడు బాలు మీనా ఇప్పుడు సడన్లిగా వచ్చి డబ్బులు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది నాకు ఒక రోజు గడువు నీ డబ్బులు నీకు వచ్చి ఇచ్చేస్తాను అంటుంది

మీనా బాలు అయితే ఒక రోజు గడువిస్తున్నాను రేపటి లోగా డబ్బులు కట్టక పోయావనుకో నీ చెరుకు బండి ఇక్కడ ఉండదు అని వెళ్తాడు.మీనా ఇదేంటి ఎక్కడ వెళ్లిన ఈ ముళ్ళకంపగాడే నాకు ఎదురు అవుతున్నాడు అని మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే సత్యం సైలెంట్ గా ఇంటికి వస్తాడు అది చూసిన ప్రభావతి ఆ వచ్చారా రండి రండి కూర్చోండి అని ఏమన్నారు పెళ్లి వాళ్లు అని అడుగుతుంది సత్యం వాళ్లు ఒప్పుకొని ఉన్నారు అంటాడు ప్రభావతి ఏ మన సంబంధానికి ఏమైందంట ఎందుకు ఒప్పుకోరు అంట బాలు అందరికీ నీలా డబ్బు మీద ఆశ వాళ్లకి ఆత్మ అభిమానం ఎక్కువ అందుకే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ గాడితో పెళ్లికి ఒప్పుకోలేదు మనోజ్ అయితే ఈ పెళ్లి కాకుంటే నాన్న నాకు డబ్బులు ఇవ్వరేమో అని మనసులో అనుకుంటు, తండ్రి సత్యం దగ్గరికి వచ్చి నాన్న ఇందులో నా తప్పేమీ లేదు నేను పెళ్లికొప్పుకున్నాను అమ్మాయి వాళ్లే చేసుకోను అంటున్నారు కొంపదీసి నాకు బిజినెస్ కోసం ఇవ్వాల్సిన డబ్బులు ఆపకండి అంటాడు

మనోజ్ బాలు ఆపరా నీ డబ్బు పిచ్చి అంటాడు ప్రభావతి మనోజ్ నువ్వు ఎందుకురా బాధపడతావ్ ఆ అమ్మాయి ఒప్పుకోనందుకు తను బాధపడాలి వాళ్లు ఈ పెళ్లికి ఒప్పుకోనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రా మనోజ్ ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే మంచి పాయసం తయారు చేసి తీసుకుని వస్తాను అంటూ ప్రభావతి వంటగదిలోకి వెళుతుంది కట్ చేస్తే మీనా తల్లి తమ్ముడు చెల్లి అందరూ కలిసి మీనా ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు అందుకు మీనా పెళ్లికి ఒప్పుకోకుండా మీ అందరికీ నేను నాన్న స్థానంలో ఉండి ఇంటిని చూసుకోవాలని అనుకుంటున్నాను కానీ మీరు నాకు బలవంతంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని చూస్తే ఒప్పుకునేది లేదు మీనా చెల్లి అక్క నేను చెరుకు బండి చూసుకుంటాను అమ్మ పూల బండి చూసుకుంటుంది తమ్ముడు ఒక్కడు చదువుకుంటాడు మేము ఇంటిని గడుపుకుంటాం

నీవు ఎలాగైనా పెళ్లి చేసుకో నాన్న కోరిక తీరుతుంది పార్వతి అవును మీనా మీ నాన్న బ్రతికినంత కాలం నా కూతురికి గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అని కలలు కనేవాడు ఎలాగైనా నా కూతురుకి మంచి సంబంధం వస్తుంది అని మీ నాన్న అనేవాడు మీనా అలాగే మనకు ఒక మంచి గొప్పింటి సంబంధం వచ్చింది నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే మీ నాన్న కూడా సంతోషపడతాడు మీనా ఆడపిల్ల ఒక్కసారి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తే తన కుటుంబాన్ని చూసుకుంటాను అంటే ఎవరు ఒప్పుకోరు అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఇక్కడ బాధపడుతూ ఉంటే నేను అక్కడ సంతోషంగా కాపురం ఎలా చేసుకోగలను అందుకని నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను చదువుకొని చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేదాకా నేను పెళ్లి జోలికి వెళ్ళను మీరు కూడా ఎక్కువగా ఆలోచించకండి అంటూ మీనా వెళ్ళిపోతుంది

పార్వతి మాత్రం మనసులో దిగులు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఎలాగైనా మీనా ని పెళ్లికి ఒప్పించాలి అని గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది అది చూసి న పంతులుగారు అమ్మ పార్వతమ్మ ఉదయం నుంచి చూస్తున్నాను ప్రదక్షణలు చేస్తూనే ఉన్నావు ఇప్పటికే నీరసంగా ఉన్నావు ఇక ఆపేయోచ్చు కదా ఉదయం నుంచి ఏమీ తినలేదు కూడా కొంచెం చూసుకొని ప్రదక్షిణలు చేయి అంటాడు పంతులుగారు పార్వతి మరేమీ లేదు పంతులుగారు మా మీనా కి మంచి గొప్పింటి సంబంధం వచ్చింది తను చేసుకోను అంటుంది ఆ అమ్మవారు తన మనస్సు కరిగించి ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చేయాలి అందుకే నా ఈ ప్రదక్షణల పూజ ఉంటుంది పార్వతి పంతులుగారు నీ కోరిక బాగానే ఉందమ్మా కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడువు అంటాడు పార్వతి అలాగే పంతులుగారు అంటూ ప్రదక్షిణలు చేస్తూ మధ్యలో పడిపోతుంది పార్వతి