Gundeninda Gudigantalu సెప్టెంబర్ 20th: స్టార్ మా’ ఛానల్ నుండి వచ్చే సీరియల్స్ కి TV ప్రేక్షకులలో .విపరీత మైన క్రేజ్ ఉంది, ఎందుకంటే ఇపటిదాకా వచ్చిన ప్రతీ సీరియల్ కూడా జనానికి పిచ్చి పిచ్చిగా నచ్చడమే కారణం. అందుకని స్టార్ మా మంచి ఊపు మీద ఉంది. కొత్త సీరియల్స్ అన్నీ TRP రేటింగ్‌లో దూసుకుపోతూ కుమ్మేస్తుండటంతో వరుసపెట్టి కొత్త సీరియల్స్ ని ప్రేక్షకుల మీదకి వదులు తూనే ఉంది.

బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి, నాగ పంచమి.. సీరియల్స్‌ను గతంలో ఇంచు మించు గా ఒకేసారి విడుదల చేసింది. ఈ మూడు సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోతున్నాయి. దీంతో వరుస పెట్టి కొత్త ధారావాహికలను లైన్‌లో పెడుతోంది. ఇక తాజాగా మరో కొత్త సీరియల్ రాబోతోంది. దాని పేరు ‘గుండెనిండా గుడిగంటలు’ ఈ సీరియల్ తాలూకు ప్రోమో వచ్చింది.

ఈ ప్రోమో చూస్తుంటే తల్లీ కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ జర్నీలా ఈ సీరియల్ ఉందబోతోందనిపిస్తుంది. ఒక తల్లి కొడుకు ల మధ్య నడిచే కధ లో ఒక హీరోయిన్ పాత్ర కూడా ఉంది. సీరియల్ ఎలా ఉండ బోతోంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ న్నారు. ఇక హీరోయిన్‌గా ‘కార్తీక దీపం’ ఫేమ్ అమూల్య గౌడ నటిస్తుంది.
కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన శౌర్యగా అమూల్య గౌడ నటించిన విషయం తెలిసిందే. అమూల్య ఇందులో లీడ్ రోల్ పోషస్తుంది. తెలుగులో ఆమెకు అదే ఫస్ట్ సీరియల్. కార్తీకదీపానికి ఎండ్ కార్డ్ పడిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అమూల్య కి ఈ సీరియల్ లో జాక్ పాట్ లాగ ఈ రోల్ దొరికింది. ఇక హీరోను తమిళ్ నుంచి హీరో తల్లి పాత్ర చేసిన ఆర్టిస్టును కేరళ నుంచి తీసుకున్నారు. ఇందులో తల్లి పాత్ర పోషిస్తున్న నటి.. జీ తెలుగులోని ‘రాధకు నీవేరా ప్రాణం’ సీరియల్‌లో హీరో నిరుపమ్ (డాక్టర్ బాబు)కు అమ్మగా నటిస్తుంది. ఆమె నటన అద్భుతంగా పండటంతో కొత్త సీరియల్‌లో తల్లి పాత్ర ఇచ్చేశారు. ఇక ఈ సీరియల్ కూడా రీమేకే కావడం విశేషం. తమిళ్‌లో విజయవంతంగా నడుస్తున్న ‘సిరాగదికా ఆసై’ అనే సీరియల్‌కి ఇది రీమేక్. స్టార్ మా లో వచ్చిన పాత సీరియల్స్ మాదిరి గానే ఈ సీరియల్ కూడా హిట్ అవడం ఖాయం అంటున్నారు.