NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 12 2024 Episode 1048: అనుపమ కాలేజీకి వస్తుందా రాదా.

Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights

Guppedanta Manasu April 12 2024 Episode 1048: శైలేంద్ర వసుధార క్యాబిన్ కి వస్తాడు. వసుధార ఏంటి శైలేంద్ర మను గారిని తీసుకువచ్చావా లేదా అని అడుగుతుంది. శైలేంద్ర చూడు వసుధారా మను నేను పిలిస్తే రానంటున్నాడు నువ్వే పిలవచ్చు కదా అని అంటాడు. వసుధార చూడు శైలేంద్ర ఫణింద్ర సార్ ఆ పని నీకు చెప్పారా నాకు చెప్పారా మరి నీ పని నేను ఎలా చేస్తాను వెళ్ళు వెళ్లి మను గారిని తీసుకొని రా అంటుంది. అప్పుడే మను వసుధార క్యాబిన్ కి వస్తాడు.శైలేంద్ర హే వాట్ ఏ సర్ప్రైజ్ బ్రో ఇలా చూడు వసుధార ఎవరు వచ్చారో మను వచ్చాడు అని చెబుతాడు. వసుధార నేను చూశాను నాకు కళ్ళున్నాయి నువ్వు వెళ్ళొచ్చు అంటుంది. శైలేంద్ర హమ్మయ్య నాకు వాచ్మెన్ డ్యూటీ తప్పింది వాడు వచ్చాడు కదా ఇప్పుడు ఇక నాతో ఏం పని ఉంటుంది

Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights
Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights

కొంపదీసి ఆ మను గాడు రాకపోతే నేను నిజంగానే గేటు దగ్గర వాచ్మెన్ లాగా డ్యూటీ చేయాల్సి ఉండేది ఓ మై గాడ్ నన్ను కాపాడావ్ అని అనుకుంటూ వెళ్లిపోతాడు శైలేంద్ర. వసుధార రండి మను గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరు మొన్న జరిగిన సంఘటనను మనసులో పెట్టుకొని ఇక కాలేజీకి రారేమో అని భయం వేసింది కానీ మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. మనుచూడండి వసుధార గారు మనం రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతుంటే ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయిమొరిగిన కుక్క దగ్గరే ఆగిపోతే మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది అలాగే దాన్ని పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళితే ప్రయాణం ముందుకు సాగుతుంది ఇంకా ఎన్నెన్నో తెలుస్తూఉంటాయి అంతేకానీ ఎప్పుడూ అక్కడే ఆగిపోకూడదు నాకు చిన్నప్పటినుండి ఈ అవమానాలు కొత్తేమీ కాదు నేను వాటిని పట్టించుకుంటే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేవాడినే కాదు అని అంటాడు మను.వసుధర సరే కూర్చుండిమనము ముందే అనుకున్నాము కదా పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ పెడదామని దాని గురించి మీతో మాట్లాడాలి ఇదిగోండి ఈ ఫైల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి ఆ ప్రోగ్రాం కి సంబంధించిన పనులు అన్ని మీరే దగ్గరుండి చూసుకోండి కావాలంటే మన లెక్చరర్స్ మీకు సపోర్ట్ గా ఉంటారు అని చెబుతుంది. మను అలాగేనండి అంటాడు.

Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights
Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights

కట్ చేస్తే శైలేంద్ర మను కాలేజీకి వచ్చిన విషయం దేవయానికి చెబుతాడు దేవి అని అదేంటి నాన్న వాడు మళ్ళీ కాలేజీకి వచ్చాడా అసలు వాడు ఏం మొహం పెట్టుకొని వచ్చాడు వాడికి నీ చేతిలో అంత అవమానం జరిగినా కూడా వాడు కాలేజీకి ఎలా వచ్చాడు అని అంటుంది శైలేంద్ర ఏమో ఒక అందుకు వాడు వచ్చిందే మంచి పని అయింది ఎందుకంటే వాడు ప్రతిరోజు నా చేతిలో అవమానాలు పడాల్సిందే కదా వాడు రావడమే చాలా మంచిది అని అంటాడు శైలేంద్ర. రాజివ్ ఇలా చూడు బ్రో వాడికి అంత ఎదురు దెబ్బ తగిలిన వాడు మళ్ళీ వచ్చాడు అంటే ఏదో ప్లాన్ ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండు అంటాడు.దేవయాని సరే నాన్న ఈరోజు నేను కూడా కాలేజీకి వస్తాను అని అంటుంది శైలేంద్ర నువ్వు ఎందుకు వాడిని ఆడుకోవడానికి నేనున్నాను కదా అనిఅంటాడు దేవి అన్ని లేదు నాన్న నువ్వు అలసిపోయి ఏదైనా తప్పుగా మాట్లాడితే అప్పుడు వెంటనే నేను అందుకుని మాట్లాడుతాను అప్పుడు ఇద్దరం కలిసి వాడిని ఆడుకోవచ్చు అని అంటుంది దేవయాని. శైలేంద్ర సరే అలాగే మా నువ్వు ఇప్పుడే కాలేజీకి వచ్చేసేయ్ అని అంటాడు దేవయాని కాలేజీకి వస్తుంది. బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. వసుధార సరే అందరూ ఒకసారి ఇటు వినండి మనం ముందే అనుకున్నాము కదా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అరేంజ్

Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights
Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights

చేయమని చెప్పాను కదా మీ మీ క్లాసులలో ఏ స్టూడెంట్ ఆట నేను తక్కువగా ఉందో చూసి వారి పేరు ఇన్స్కి ఫోన్ చేసి వారికి పేరెంట్స్ మీటింగ్ ఉంది కాలేజీకి రండి అని చెప్పండి వాళ్లు ఎప్పుడు టైం చెబుతారు ఆ పేరెంట్స్ టైం ఇన్ బట్టే మనం మీటింగ్ అరేంజ్ చేద్దాం కాబట్టి మీరందరూ ఆ పనిలో ఉండండి అని చెబుతుంది వసుధార. దేవయాని అదేంటి ఇప్పటివరకు ఈ కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ అనేది లేదు రిషి ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు కదా ఇప్పుడేంటి కొత్తగా ఇవన్నీ వస్తున్నాయి అయినా వసుధార నువ్వు వచ్చినప్పటి నుండే కాలేజీకి ప్రతి ఒక్క ప్రాబ్లం వస్తుంది అవును నువ్వు ఏం చెప్పావు మూడు నెలల్లో రిషి ని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని చెప్పావు కానీ ఆ పని పక్కన పెట్టి ముందు నువ్వు ఈ పని చూసుకుంటావా ఏంటి ఈ మధ్య నీకు రిషి మీద ప్రేమ తగ్గిపోయినట్లుంది కొంపతీసి రిషి లేడని మర్చిపోయావా ఏంటి అతన్ని పట్టించుకోవడం వదిలేసావా ఏంటి అని అంటుంది

Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights
Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights

దేవయాని. శైలేంద్ర మామ్ దీన్ని బట్టి చూస్తే వసుధారా రిషి ని మర్చిపోయినట్లే కదా అని అంటాడు. మను ఏంటండీ మేడం మీకు చెప్పిందా రిషి సార్ ని మర్చిపోయాను అని మీరు ఎలా మాట్లాడుతారు మేడం ఎప్పటికీ సార్ ని మర్చిపోదు అని అంటాడు. దేవయాని ఏంటి మను నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నట్లు ఉన్నావు నీ అతివినయం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని అంటుంది దేవయాని. వసుధార మేడం ప్లీజ్ మీరు ఆపితే ఇంకా బాగుంటుంది నేను రిషి సార్ ని మర్చిపోయాను అని మీకు చెప్పానా సార్ ని ఎప్పుడు వెతికించాలో కూడా మీకు చెప్పి చేయాలా నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అన్ని మీకు చెప్పి చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది వసుధార పనింద్ర ఏ దేవయాని నువ్వు అందుకే కాలేజీకి వచ్చావా ఇలా లేనిపోని వి అన్ని తీసుకువచ్చి గొడవ పెట్టుకోవడానికి వచ్చావా శైలేంద్ర దేవయాని ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అంటూ వాళ్లని మీటింగ్ నుండి బయటికి వెళ్ళకూడదు ఫణింద్ర. ఫణీంద్ర చూడమ్మా వసుధారా నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకు అని అంటాడు.

Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights
Guppedanta Manasu Today Episode April 12 2024 Episode 1048 highlights

కట్ చేస్తే మహేంద్ర మను వసుధార అందరూ ఇంటికి వస్తారు.మహేంద్రఏంటి మను నువ్వు అనుపమతో ఏదో మాట్లాడాలి అన్నావు ఏంటది నువ్వు మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ మహేంద్ర వెళ్ళిపోతాడు. వసుధార మను గారు నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ వసుధారా వెళ్ళిపోతుంది. మను ఏంటి మేడం మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు గాయాలన్నీ మానిపోయాయా అని అడుగుతాడు. బాగానే ఉంది అంతా తగ్గిపోయింది అని చెబుతుంది. వసుధార రండిమను గారు భోంచేశాక వెల్దురు అని అంటుంది మనం వాళ్లతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు.మహేంద్ర అవునమ్మా వసుధార రేపు కాలేజీకి అనుపమ వస్తుందా ఎందుకంటే పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్ ఉంది అన్నావు కదా అని అడుగుతాడు. అనుపమ లేదు మహేంద్ర నేను రాను అంటుంది. వసుధార లేదు మేడం మీరు కచ్చితంగా రండి ఎందుకంటే పేరెంట్స్ లెక్చరర్స్ మీటింగ్స్ లో చాలా వరకు మనం లెక్చరర్స్ అందరం ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది మీరిచ్చే సజెషన్స్ పేరెంట్స్ కి అర్థమయ్యేలా చెబుతారు అందుకే మిమ్మల్ని రమ్మంటున్నానుఅంటుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella