NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 8 2024 Episode 1045: శైలేంద్ర మను దగ్గరికి వెళ్లి మనుని దగ్గరుండి కాలేజీకి తీసుకువస్తాడా లేదా

Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045 highlights

Guppedanta Manasu April 8 2024 Episode 1045:  మను లేదండి నేను మిమ్మల్ని తాతయ్యగా అంగీకరించలేను నన్ను కన్నతల్లి నన్ను అమ్మ అని పిలవద్దని కండిషన్ పెట్టింది మరి నాకు తల్లి బంధమే లేనప్పుడు ఈ బంధాలన్నీ ఎక్కడివి నాకు మధ్యలో వచ్చే ఈ కొత్త కొత్త బంధాలు నేను అంగీకరించలేను నాకు నా కన్న తల్లి ప్రేమ తప్ప ఏ ప్రేమలో ఏ బంధాలు నాకు అవసరం లేదు అంటాడు మను. ఏంజెల్ అది కాదు మను అత్తయ్య ఎప్పుడు ఒకప్పుడు కచ్చితంగా మారుతుంది కానీ మీరిద్దరూ తల్లి కొడుకుల్లాగా కలిసిమెలిసి ఉండే రోజు వస్తుంది కాదనడం లేదు కానీ నిన్ను ఎంతో ఇష్టపడుతున్న నీ తాతయ్యని నువ్వు కాదనడం కరెక్ట్ కాదు మను నేనెలా పిలుస్తున్నాను నువ్వు కూడా అలాగే పిలువు విశ్వం అని పిలువు అని అంటుంది. మను ఏంటి వసుధార గారు మీ మీద ఎంతో నమ్మకంతో నేను మిమ్మల్ని నమ్మి వచ్చాను మీరు అర్జెంటు పని ఉంది రండి అని తీసుకువచ్చారు ఇదేనా అర్జెంటు పని ఇదేనా ముఖ్యమైన పని అంటూ వెళ్ళిపోతాడు మను.

Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045  highlights
Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045 highlights

కట్ చేస్తే మను వసుధారా ఇంటికి వస్తారు వస్తదా రా కాఫీ తీసుకువచ్చి మనకి ఇస్తుంది. మను అక్కర్లేదండి నేను వెళ్తాను అని అంటాడు. వసుధార ఏంటండీ కోపం వచ్చిందా అని అంటుంది. మనం నాకు కోపం ఎందుకు వస్తుందండి అయినా నాకు కోపం అంతా అతని మీదే అతని వల్లే కదా ఇప్పుడు మా అమ్మ ఇలా నిందలపాలు అవుతుంది అతని వల్లే కదా నాకు ఈ దుస్థితి వెతుకుతాను అతని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను పట్టుకొని మా అమ్మ తలెత్తుకుని తిరిగేలా అందరికీ సమాధానం చెబుతాను అయినా మా అమ్మ ఏ తప్పు చేసిందండి ఇంతమందిలో ఇన్ని మాటలు పడడానికి గల కారణం నా తండ్రి కదా మరి ఆ తండ్రి ఇలా మా అమ్మని వదిలేయడం కరెక్టేనా అసలు తను ఎక్కడున్నాడు వీళ్లిద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారు

Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045  highlights
Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045 highlights

అతని ఎవరు అతని పేరేంటి నాకు తెలియనే తెలియదు కానీ అతన్ని కచ్చితంగా పట్టుకుంటాను పట్టుకొని మేము ఎన్నాళ్లు అనుభవిస్తున్న బాధను అతనికి తెలియజేస్తాను తెలిసేలా చేస్తాను అదే బాధ తను కూడా అనుభవించేలా చేస్తాను అని వెళ్ళిపోతాడు మను.ఇదంతా వింటున్న మహేంద్ర చాలాబాధగా వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. అనుపమ అప్పుడే బయటకు వెళ్తూ ఉంటుంది.మహేంద్ర అనుపమను చూసి అనుపమ ఎటు వెళ్తున్నావ్ ఇలా రా అని పిలుస్తాడు. అనుపమ వచ్చి కూర్చుంటుంది ఏంటి మహేంద్ర అని అడుగుతుంది.ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అనుపమ అంతా బాగుందా అని అడుగుతాడు. అనుపమ బాగానే ఉంది మహేంద్ర విషయం ఏంటో చెప్పు అని అడుగుతుంది. మహేంద్ర అదే అనుపమ నేను ఇలా అంటున్నానని నువ్వు బాధపడొద్దు నిన్ను మను నీ చూస్తుంటే ఒకప్పుడు జగతి రిషి వాళ్ళను ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి ముందు మరి కొంతమందికి వెనుకకు వస్తుంటాయి అంతే కానీ ప్రతి ఒక్కరూ కష్టపడక తప్పదు సుఖపడక తప్పదు అలా అని కష్టాన్ని జీవితాంతం మోయలేము అలాగే సుఖం అనేది కూడా జీవితాంతం మనతోనే ఉంటుందని కూడా నమ్మకం లేదు అవి వస్తూ పోతుండే చుట్టాల లాంటివి

Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045  highlights
Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045 highlights

అలాంటికి మనం భయపడకూడదు అలా భయపడ్డామి అనుకో ఇంకా భయపెడుతూనే బాధ పెడుతూనే ఉంటాయి. మమ్మల్ని చూసావా మేము ఎన్ని కష్టాలు అనుభవించామో ఆఖరికి ఆ కష్టాల్లో జగతిని కోల్పోయాము అయినా గాని ఇంకా బాధల మీద బాధలు పడుతూనే ఉంటున్నాము వసుధారని చూడు తను ఇప్పటికీ రిషి విషయంలో ఎంత బాధ అనుభవిస్తుందో నీకు తెలియనిది కాదు కానీ ఒక బాధను దూరం చేసుకోవాలి అంటే మనసులు ఉన్న ఆ అలజడి తెలిస్తేనే కాదా దానికి పరిష్కారం దొరుకుతుంది మరి నీ బాధ నీ మనసులోని పెట్టుకుంటే దానికి సమాధానం ఎప్పటికీ దొరకాలి అనుపమ నీ జీవితం నీ ఒక్కదానిదే కాదు ఇప్పుడు నీ కడుపున పుట్టిన మను ఉన్నాడు అది మను కు కూడా వర్తిస్తుంది దాని వల్లే మను నలిగిపోతున్నాడు. అందుకనే చెబుతున్నాను అనుపమ నీ సమస్య ఏంటో ముందు మాకు చెబితేనే కదా తెలిసేది ఇప్పటికైనా చెప్పు అనుపమ అంటాడు. వసుధార అవును మేడమ్ మీరు మను గారి గురించి అయినా ఆలోచినిజం ఇప్పటికైనా చెప్పండి అంటుంది.

Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045  highlights
Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045 highlights

కట్ చేస్తే కాలేజీలో బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తారు. శైలేంద్ర అబ్బా ఈ సైలెంట్ భరించలేకపోతున్నాను మాట్లాడడానికే కదా బోర్డు మీటింగ్ పెట్టింది మరి ఇక్కడికి వచ్చి ఫైల్ చూస్తూ కూర్చుంటారు ఏంటో వీళ్ళు నాకేమీ అర్థం కావడం లేదు అని అనుకుంటాడు శైలేంద్ర. వసుధార సరే నండి మనం ఇంతకుముందు బోర్డు మీటింగ్లు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా ముందుగా అటెండెన్స్ తక్కువ ఉన్న పిల్లలని ప్రతి క్లాసులోనూ లిస్టు తయారు చేయించండి ఫోన్ల ద్వారా నైనా లేదా మెసేజ్ లు ద్వారా నేను వారికి ఈ ప్రోగ్రాం గురించి తెలియజేయండి తర్వాత ప్రోగ్రాం కండక్ట్ చేద్దాం అని అంటుంది వసుధార. బోర్డు మెంబర్స్ అలాగే మేడం కచ్చితంగా చేద్దాం అంటారు.

Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045  highlights
Guppedanta Manasu Today Episode April 8 2024 Episode 1045 highlights

అందులో ఒక బోర్డు మెంబర్ అవును ఈరోజు మను గారు రాలేదేంటి అని అడుగుతాడు. శైలేంద్ర ఏమో తను ఇక ముందు ముందు కూడా కాలేజీకి రాడేమో కాలేజీని వదిలి వెళ్ళిపోతాడేమో ఎవరికి తెలుసు అని అంటాడు. బోర్డ్ మెంబర్స్ అదేంటండీ తను ఈ కాలేజీలో ఒక బోర్డ్ మెంబర్ కదా మరి తను అంత సడన్గా ఎందుకు వెళ్లిపోతాడు అని అడుగుతాడు.ఫణీంద్ర చూడు శైలేంద్ర నువ్వు అయినా మను రాడని నువ్వెలా చెబుతున్నావ్ మనుఎందుకు రాలేదు అని తన దగ్గరికి వెళ్లి అడిగి తనను తీసుకువచ్చే బాధ్యత కూడా నీకు ఉంది కదా వెళ్ళు ముందు నువ్వు వెళ్లి మను ఎందుకు రాలేదు అని తనని అడిగి పక్కన ఉండి మనుని తీసుకొని రా పో అంటాడు ఫణీంద్ర

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella