NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 10 Today Episode:వసు అడిగిన కోరిక విని షాక్ అయిన రిషి.. జగతి మేడంను అమ్మా అని పిలవమని అడుగునున్న వసు..!

Guppedantha Manasu November 10 Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 10వ తేదీ Guppedantha Manasu సీరియల్ 604 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ లో వసుధర సాధించిన విజయాన్ని ఫోన్లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేంద్ర,జగతి,గౌతమ్. ఇప్పుడు అంతా బానే ఉంది కదా వచ్చేయండి అని గౌతమ్ అంటే రిషిని ఎప్పుడు ఎప్పుడు కలవాలి అని పరిగెడుతున్న గుర్రం లాగా ఉంది నా మనసు కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర. రిషి జీవితంలో ఏదీ మిస్ అవ్వకూడదు అంటే కొన్ని రోజులు మమ్మల్ని మిస్ అవ్వాలి అని అంటాడు మహేంద్ర. నీకోసం వాడు వాడి కోసం మీరు మీ ఇద్దరి బాధ చూడలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను అంటాడు గౌతమ్.
కొన్ని పొందాలి అంటే కొన్ని వదులుకోవాలి గౌతమ్ ఇది అలాంటిదే అని బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర.

వసును నీకు ఏమి కావాలో కోరుకోమన్న రిషి :

Vasu

ఇక వసు ఏదో ఆలోచిస్తు ఉంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రిషి. నా లైఫ్ జర్నీ గురించి ఆలోచిస్తున్నాను సార్. ఇదంతా జగతి మేడం వల్లే అయింది అంటుంది వసు.ఎన్ని కష్టాలు పడ్డా ఆఖరికి నువ్వు అనుకున్నది సాధించావు ఈ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటాడు రిషి నీకేం కావాలో అడుగు అంటాడు రిషి. నాకు ఏమీ వద్దు అంటుంది వసు.లేదు అడుగు అని రిషి అనగా కచ్చితంగా ఇస్తారా అని అడుగుతుంది వసుధార. నేను మాట ఇస్తే తప్పే ప్రసక్తి లేదు అంటాడు రిషి. జగతి మేడం అని మధ్యలో ఆగుతుంది వసు. కారు నడుపుతున్న రిషి సడన్ గా బ్రేక్ వేస్తాడు ఏం అడగబోతుంది అని కంగారు పడతాడు.అవును సార్ నేను ఇంత విజయాన్ని సాధించాను అంటే అందుకు కారణం జగతి మేడం నాకు ఇంత చేసినా ఆవిడకి నేను ఏమీ చేయకపోతే నాకు తృప్తిగా ఉండదు అని జగతి మీద కృతజ్ఞత చూపిస్తుంది వసుధార.

జగతి మేడం అని వసు అనగానే కారు ఆపేసిన రిషి :

Vasu rishi

ముందు నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు రిషి. నేను మేడంని చూడాలి సార్ ఆవిడకి పాదాభివందనం చేయాలి అని అంటుంది వసు.సరే సార్ కారు పోనీయండి నాకేం కావాలో చెప్తాను అని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి పడవలు చేసి పేర్లు రాసి చెరువులో వదలుతుంది. అప్పుడు వదిలావ్ కదా మరి ఇప్పుడు ఎందుకు అంటే అప్పుడు కోరిక వేరు ఇప్పుడు కోరిక వేరు సర్ అని అంటుంది వసుధార. ఇప్పుడు జగతి మేడం వాళ్ళు రావాలని వదులుతున్నాను సార్ అని అంటుంది. నేను కూడా పడవలు చేస్తాను అని తన దగ్గర పేపర్ తీసుకుని పడవలు చేస్తాడు.ఇంత ఫాస్ట్ గా ఎలా చేశారు సార్ అంటే మా గురువుగారు నేర్పించారు అని వసుధారా పేరు చెబుతాడు.నేను ఎప్పుడు నేర్పించాను సార్ అంటుంది వసు. ఆరోజు లైబ్రరీలో నేర్పించావు కదా అని అంటాడు. అది ఇంకా గుర్తుంచుకున్నారా అంటుంది వసుధార. ప్రేమ అంటే నమ్మకం నేను నీకోసం ఏమైనా చేస్తాను అంటాడు రిషి.

రిషి వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న దేవయాని :

Devayani

ఇక రిషి వాళ్ళ కోసం కంగారుగా ఎదురుచూస్తు ఉంటుంది దేవయాని.అది టాపర్ అయిందని ఏం పార్టీలు చేసుకుంటున్నారో ఏంటో ఈ గౌతమ్ ఫోన్ కూడా కలవట్లేదు అని ధరణిని పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య అని గదిలోంచే అంటుంది ధరణి.నాకు తల నొప్పిగా ఉంది కొంచెం గ్రీన్ టీ కావాలి అని అడుగుతుంది.కొంచెం సేపు ఆగాలి అత్తయ్య అని అంటుంది ధరణి. ఏంటి అంతా కొంపలు మునిగిపోయే పని అని అంటుంది. ధరణి ఫస్ట్ వచ్చింది కదా అందుకని రిషి స్వీట్ చేయమన్నాడు అని అంటుంది. అయితే నన్ను అడగవలసిన పనిలేదా నేను ఇంట్లో ఒక దాన్ని ఏడ్చాను కదా అని అంటుంది దేవయాని. రిషి వచ్చి అడిగితే మీరు వద్దన్నారని చెప్తాను అంటుంది ధరణి. ఏంటి బెదిరిస్తున్నావా అని దరణిని తిడుతుంది.పడవలు చేసి నీటిలో వదలడానికి చెరువులోకి వెళ్తారు రిషి వసుధారలు. ఏంటి ఇవన్నీ ఇప్పుడే వదిలేస్తావా అని అడుగుతాడు రిషి. అవును సార్ ఇప్పుడు కొన్ని తెచ్చాను అక్కడ ఉన్నవి మీరు కొంచెం తెండి అంటుంది వసు. నిన్ను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళలేను. ఈ చెయ్యి వదలలేను అని అంటాడు రిషి. అవును సార్ ఈ చేయి జీవితకాలం వదలొద్దు అంటుంది వసుధార.

చెరువులో పడవలు వదిలి తమ కోరికలు కోరుకున్న రిషి, వసు..

Vasu rishi

పడవలు నీటిలో వదిలి జగతి మేడం వాళ్ళు త్వరగా రావాలని దండం పెట్టుకుంటుంది వసు. నాకు ఇవన్నీ నమ్మకం లేదు కానీ వసు మీద నమ్మకంతో దండం పెట్టుకుంటున్నాను డాడ్ వాళ్ళు త్వరగా రావాలి అని రిషి కూడా దండం పెట్టుకుంటాడు. చెరువులో ఆడుతూ ఆడుతూ కాలుజారి పడుతుంది వసుధార. కంగారుపడిన రిషి తనని లేవదీసి ఒడ్డున కూర్చోబెడతాడు.గౌతమ్ కాలేజీలో సంగతులన్నీ దేవయానికి చెప్పి ఆమెతో మరి కొంచెం ఆడుకుంటాడు గౌతమ్.తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడ్ లో చూద్దాం.

 

 

 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N