23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 22Today Episode: మహేంద్రకు చివరి అవకాశం ఇచ్చిన రిషి.. ఈరోజు దాటితే అంతే సంగతులు..!

Share

 

Guppedantha Manasu November 22Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 22వ తేదీ Guppedantha Manasu సీరియల్ 613వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.దేవయాని వేసిన ప్లాన్ ను ఆఖరి నిమిషంలో వచ్చిన మహేంద్ర తలకిందులు చేస్తాడు.

ఘనంగా కాలేజ్ లో జరిగిన ఫంక్షన్ :

Vasu, rishi

ఆ తరువాత ఫంక్షన్ కాలేజీలో ఘనంగా జరుగుతుంది. అందరూ బొకేలు ఇస్తారు..వసు మెడలో రిషి పూలమాల వేస్తాడు. జగతి-మహేంద్ర ఆనందానికి అవదులు ఉండవు.ఆ తర్వాత ఇంటర్యూ మొదలు పెట్టండి అంటుంది జగతి. ఇంతలో వసుధార ఓ రిక్వెస్ట్ అంటుంది. నన్ను ప్రోత్సహించి నన్ను నడిపించిన రిషి సార్-జగతి మేడం నా పక్కనే  ఉండాలి అంటుంది. జగతి-రిషి ఇద్దరూ సరే అంటారు. జగతి కాళ్లకి నమస్కరించి ఇంటర్యూకి కూర్చుంటుంది వసుధార. నన్ను నడిపించంది జగతి మేడం అయితే ఈ ప్రయాణంలో ధైర్యం నింపింది రిషి సార్ అంటూ ఇద్దర్నీ పొగుడుతుంది.

తెలివిగా ఇంటర్వ్యూలో మాట్లాడిన వసు :

Vasu, rishi

అలాగే వసు కుటుంబం. గురించి అడిగితే అమ్మా-నాన్న అక్కయ్యల గురించి చెబుతుంది. ఇల్లు-కుటుంబం-ఊరుని వదిలేసి ఒంటరిగా ఇక్కడకు వచ్చాను, పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ చదువుకున్నాను..చివరికి నా కష్టానికి ఫలితం దక్కింది అంటుంది.యూనివర్శిటీ టాపర్ అవ్వాలంటే ఏం చేయాలని స్టూడెంట్స్ సలహా ఇస్తారు అని. విలేకరి అడిగిన ప్రశ్నకు విజయానికి మూడు సూత్రాలు…శ్రమ-శ్రమ-శ్రమ….వెళ్లేదారిలో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి అన్నింటినీ భరించాలి..అవసరమైన చోట ఎదిరించాలి..అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని చెబుతుంది వసు.చదువు అయిపొయింది కదా ఏదైనా పెద్ద ఉద్యోగంలో స్థిరపడతారా అవును..స్టూడెంట్స్ కి చదువుచెప్పే ఉద్యోగంలో స్థిరపడతాను అంటుంది.

వసు గురించి గొప్పగా చెప్పిన రిషి :

Rishi, vasu

వసుధార గురించి రిషిని చెప్పమని అడగగా వసుధార అందరికీ ఆదర్శంగా నిలిచింది..తను జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నానంటూ ఇంటర్యూ పూర్తిచేస్తాడు…ఆ తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకుంటారు… మహేంద్ర జగతికి సైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అయితే వసుధార జగతి చేయి వదలదు…మహేంద్ర వెళుతుండగా రిషి వెళ్లి చేయి పట్టుకుంటాడు..ఎలాగోలా తప్పించుకుని ఇద్దరు బయటకు రాగానే ఇంకా జగతి మాత్రం మనం వెళ్లాలా మహేంద్ర అని అడుగుతుంది…కొన్ని తప్పవు అంటూ మహేంద్ర కారు డోర్ తీస్తుండగా రిషి వచ్చి చేయిపట్టుకుంటాడు…మీతో మాట్లాడాలి అంటాడు.

మహేంద్ర రాకతో దేవయాని కోపం :

Devayani seriousness

అటు ఇంట్లో అందరూ కాలేజీలో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పుకుని మురిసిపోతుంటే దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతుంది.ఇక రిషి మహేంద్రను డాడ్..ఏం జరిగిందని మీరు ఎందుకు వెళ్లారని నేను అడగను మిమ్మల్ని దూరం చేసుకుని మీరు లేని రిషి ఎలా ఉంటాడో ఆ బాధ ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు..మీరెప్పుడూ నాతోనే ఉండాలి అంటాడు.కాలం-పరిస్థితులు ఈ రెండూ మనుషుల కన్నా బంధాల కన్నా బలమైనవి… అవి ఆడిస్తాయి..అవే శాసిస్తాయి.. ఇప్పుడు జరిగింది కూడా ఇదే..కొన్ని ప్రమేయం లేకుండా జరుగుతాయి..వాటికి మనం బాధ్యులం కాదు బాధితులం మాత్రమే అవుతాం అంటాడు మహేంద్ర

రిషి -మహేంద్ర సెంటిమెంటల్ డ్రామా :

Rishi, mahendra

సరే..డాడ్ జరిగిందేదో జరిగింది..నాపై కోపం వచ్చిందో, నేనేదైనా తెలియక తప్పుచేశానో.. పెద్దమ్మ ముందు మమ్మల్ని హర్ట్ చేశానో..ఏదేమైనా ఈ రిషి మిమ్మల్ని వదిలి ఉండలేడు డాడ్ అంటాడు రిషి.ఇక
మహేంద్ర మాత్రం చెట్లకు కాయలు కాస్తాయి..కొన్నాళ్లకి ఆ కాయలే చెట్లనుంచి విడిపోతాయి..అది ప్రకృతి ధర్మం..కొన్ని బంధాలు కూడా ఇలాగే దూరమైపోతాయి..అయ్యాయి కూడా అంటాడు.మేం ఎందుకు వెళ్లామో ఆ పరమార్థం కూడా ఇంకా అసంపూర్ణంగా మిగిలిపోయింది మీరు వెళ్లిన దానిగురించి కాదు..మీరు నాతోపాటూ ఇంటికి రావాలని ఆశపడుతున్నాను…కానీ మీరు మళ్లీ వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు కదా… ఏంటి డాడ్ ఇది..నాకు విధించిన శిక్ష సరిపోలేదు అనుకుంటున్నారా…అన్నీ పోగొట్టుకోవడం అందర్నీ దూరం చేసుకోవడం చిన్నప్పటి నుంచీ జరుగుతూనే ఉందికదా..నాకున్నది మీరే కదా అంటూ ఎమోషనల్ అవుతూ నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా అంటాడు.శిక్ష వేశాను అని నువ్వు అనుకుంటున్నావ్..నాకు నేనే శిక్ష విధించుకున్నానని నేను భావిస్తున్నాను అని మహేంద్ర అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 

 


Share

Related posts

Guppedantha Manasu November 1 Episode: పెద్దమ్మపై ప్రేమ…. వసు, రిషిల బంధానికి అడ్డుగా నిలవనుందా..??

Ram

Gautami: తన వారసురాలిగా కూతురిని రంగంలోకి దింపుతున్న గౌతమి..?

sekhar

రోడ్డు పక్కనే టీ తాగినా విజయ్ దేవరకొండ..!!

sekhar