21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 23Today Episode:జగతి, మహేంద్ర లకు ఆక్సిడెంట్…ప్రాణాలతో ఉండేదెవరు…!?

Share

Guppedantha Manasu November 23Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 23వ తేదీ Guppedantha Manasu సీరియల్ 614వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.వెళ్లిపోతున్న మహేంద్రను ఆపి రిషి చాలా ఎమోషనల్ అవుతాడు.

తండ్రి దగ్గర ఎమోషనల్ అయిన రిషి :

Rishi emotional

నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్లిపోయి నాకు పెద్ద శిక్ష వేశారు అని రిషి అంటే శిక్ష నీకు వేశానని నువ్వు అనుకుంటున్నావ్.. నాకు నేనే శిక్ష విధించుకుంటున్నానని నేను భావిస్తున్నాను..’ అంటాడు మహేంద్ర. వాళ్ల మాటలన్ని వసు, జగతీలు వింటూనే ఉంటారు. డాడ్ ప్లీజ్.. నా తప్పు ఉండి ఉంటే.. ఇవిగో ఈ చేతులతో నా చెంపలు వాయించి మరీ చెప్పండి.. అంతే కానీ వదిలేసి వెళ్లొద్దు’ అంటూ వేడుకుంటాడు రిషి. అప్పటికీ మహేంద్ర నోరు తెరవకపోవడంతో.. ‘డాడ్ ఈ రోజు రాత్రంతా ఆలోచించుకోండి.. మీ మనసు ఏం చెబితే అది చేయండి. రావాలనిపిస్తే రేపు సూర్యోదయం కన్నా ముందే ఇంటికి రండి.. ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం.. కబుర్లు చెప్పుకుందాం అంటూ తన మనసులోని మాట చెప్పేసి మహేంద్ర సమాధానం వినకుండానే వెళ్లిపోతాడు. అయితే కారు దాకా వెళ్లిన రిషి మహేంద్ర కోసం పరుగున వచ్చి మహేంద్రని హత్తుకుని ఏడ్చేస్తాడు. మహేంద్ర కూడా రిషిని రిషిని హత్తుకోబోతుంటే వెంటనే మహేంద్రను వదిలి.. వేగంగా కారు దగ్గరకు వెళ్లి కారు స్టార్ట్ చేస్తాడు. వెంటనే వసు కూడా కారు ఎక్కుతుంది.

ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్న మహేంద్ర :

Mahendra, rishi

ఇక రాత్రి అయ్యేసరికి ఇటు రిషి వాళ్లు.. అటు జగతీ వాళ్లు నిద్రపోకుండా.. ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే వసు, రిషీలు బాల్కనీలో నిలబడి మహేంద్ర గురించిమాట్లాడుకుంటుంటే దేవయాని వచ్చి ‘వసుధారా ఈ టైమ్‌లో ఇద్దరూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు’ అంటూ తిట్టిపోసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే రిషి తన తప్పేం లేదు పెద్దమ్మా.. డాడ్ వాళ్లు రేపు వస్తారనే ఆనందంలో నిద్రరావట్లేదు’ అంటూ సమాధానం ఇస్తాడు.

దేవయానికి వసు సరైన సమాధానం :

Vasu

అప్పుడే దేవయాని చాలా వెటకారంగా మహేంద్ర వాళ్లని తప్పుబట్టి మాట్లాడే ప్రయత్నం చేయగా వసు అడ్డుకుంటుంది.రిషి కూడా.. ‘అలా మీరు మాట్లాడొద్దు పెద్దమ్మా.. వినడానికి కష్టంగా ఉందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దేవయాని రగిలిపోతుంది. ఇక మహేంద్ర మాత్రం జగతీతో ఇంటికి వెళదాం అంటాడు. నిన్నే మేము ఇంటికి వచ్చేస్తున్నాం అనే మాట చెప్పేలోపే రిషి వెళ్లిపోయాడు.. మనం రేపు ఉదయాన్నే రిషి దగ్గరకు వెళ్లిపోతున్నాం’ అంటాడు. జగతీ చాలా సంతోషిస్తుంది.

జగతి, మహేంద్రలకు ఆక్సిడెంట్ :

Gowtham

ఇక రేపటి ఎపిసోడ్ లో ఎవరు ఉహించని ట్విస్ట్ జరిగింది అనే చెప్పాలి. ఒకపక్క రిషి, వసు మహేంద్ర, జగతి వాళ్ళ గురించి ఎదురుచూస్తుంటారు.అప్పటికే జగతీ, మహేంద్రలు బయలుదేరతారు. జగతి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఓ లారీ అడ్డంగా రావడంతో దానిని తప్పించే ప్రయత్నంలో ఆ కారు ఓ కరెంట్ స్తంభాన్ని గుద్దేస్తుంది.ఇక హాస్పిటల్ నుంచి డాక్టర్ గౌతమ్‌కి జరిగిన విషయం చెప్పగా గౌతమ్ షాక్ అవుతాడు.మరి ఇద్దరిలో ఎవరికయినా ఏమైనా అయిందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.


Share

Related posts

Samantha: పెళ్లి జీవితం పై తొలిసారి రియాక్ట్ అయిన సమంత..!!

sekhar

`ఎన్టీఆర్ 30`లో ఎట్ట‌కేల‌కు హీరోయిన్‌ను ఖాయం చేసిన కొర‌టాల‌!?

kavya N

Karthika Deepam: హిమపై మరింత కోపాన్ని పెంచుకున్న జ్వాల ఏమి చేయనుంది..!

Ram