21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 25Today Episode: జగతికి రక్తం ఇవ్వబోతున్న రిషి.. తల్లిగానా..? సాటి మనిషిగానా..?

Share

Guppedantha Manasu November 25Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 25వ తేదీ Guppedantha Manasu సీరియల్ 617వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఎంతో సంతోషంగా రిషి దగ్గరకు వస్తున్న జగతీ, మహేంద్రలకు యాక్సిడెంట్ అవ్వడంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.హాస్పిటల్ కి వెళ్లిన గౌతమ్.. రిషికి విషయం చెప్పాలని కాల్ చేస్తే మొదట దేవయాని కట్ చేస్తుంది. తర్వాత రిషి ఫోన్‌కి వరసగా కాల్ చేసినా ఫోన్ రిషి రూమ్‌లోనే ఉండిపోవడంతో ఎవరికీ వినిపించదు.రిషి.. మహేంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. డాడ్ వాళ్లు ఇంకా రాకపోవడం ఏంటీ? డాడ్ మరేదైనా నిర్ణయం తీసుకున్నారా?’ అంటూ అల్లాడిపోతూ ఎదురు చూస్తుంటాడు.

హాస్పిటల్ కి రమ్మన్న గౌతమ్ :

Gowtham

ఇంతలో దేవయాని వచ్చి.. రిషి మనసు మార్చాలనే ఉద్దేశంతో ఏవో నాలుగు మాటలు చెప్పి కిందకు తీసుకునిపోతుంది.మరోవైపు గౌతమ్.. ఆసుపత్రిలో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. డాక్టర్ బయటికి వచ్చి.. మీ అంకుల్‌కి ఫర్వాలేదు కానీ.. మీ ఆంటీ పరిస్థితి కష్టంగా ఉంది. ఆమెకి ఓ నెగటివ్ బ్లెడ్ కావాలి.. ఏర్పాటు చేసుకోండి అని వెళ్తాడు. దాంతో గౌతమ్‌కి మరింత టెన్షన్ పెరిగిపోతుంది. వెంటనే రిషికి చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని.. వసుకి కాల్ చేస్తాడు. పక్కనే ఉన్న రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అంటే రేయ్ అర్జెంట్‌గా బయలుదేరి ఆసుపత్రికి రాారా ఎందుకు ఏంటీ అని అడగొద్దు అంటాడునువ్వు మాత్రంరావాల్సిందే అంటూ లొకేషన్ పంపిస్తున్న ’ అంటూ ఫోన్ కట్ చేస్తాడు..

మహేంద్రను బెడ్ పై చూసి అల్లాడిపోయిన రిషి :

Mahendra, rishi

అయితే రిషి.. ‘గౌతమ్ గాడు అలాగే అంటాడులే అని లైట్ తీసుకుంటాడు. తీరా గదిలోకి వెళ్లి తన ఫోన్ చూసుకుంటే చాలా మిస్డ్ కాల్స్ ఉండటంతో కంగారు మొదలవుతుంది. గౌతమ్ ఏదైనా సమస్యల్లో ఉన్నాడా? అనుకుంటూ వసు, రిషీలు ఆసుపత్రికి వెళ్తారు. అప్పటికే గౌతమ్.. బ్లెడ్ కోసం తన ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తూ కంగారుగా ఉంటాడు. రిషీ రాగానే.. కాస్తా నానిస్తూ.. నసుగుతూ మహేంద్రని ఐసీయూలో ఉండటం చూసి రిషి అల్లాడిపోతాడు పరుగున డాడ్ అంటూ లోపలికి వెళ్తాడు. మహేంద్ర సృహలోకి వస్తాడు. ‘నీ దగ్గరకు వచ్చే దారిలోనే ఇలా జరిగింది నాన్నా.. సారీ’ అంటాడు మహేంద్ర ఆవేదనగా. వెంటనే వసు ఏడుస్తూ మే..డమ్ ఎక్కడా.?’ అంటుంది. దాంతో పాపం గౌతమ్ ఏం చేయలేనిస్థితిలో.. పక్కనే ఉన్న కర్టెన్‌ని పక్కకు జరుపుతాడు. పాపం జగతీ.. తలకు కట్టుతో.. ఆక్సిజన్ పైప్‌తో పడి ఉంటుంది.

జగతికి రక్తం ఇస్తా అన్న రిషి :

Jagathi, rishi

అది చూసి వసు, రిషీ ఇద్దరూ షాక్ అవుతారు. జగతీ.. అంటూ అరుస్తాడు మహేంద్ర. వసు ఆవేదనగా మేడమ్ అని పరుగుతీస్తుంది.డాక్టర్ వచ్చి.. ‘బ్లెడ్ ఏర్పాటు చేశారా? ఓ నెగటివ్ కావాలని చెప్పాను కదా? ఏమైంది. అనడంతో వెంటనే రిషి.. ‘నాది అదే బ్లెడ్ గ్రూప్ నేను ఇస్తాను’ అనేస్తాడు రిషి. బ్లెడ్ ఇస్తున్నంత సేపు తల్లినే చూసుకుంటాడు.ఇక రేపటి ఎపిసోడ్ లో రిషి.. జగతీ రూమ్‌లోంచి బయటికి వచ్చేక్షణంలో జగతీ.. రిషీ చేయి పట్టుకుని రిషీ అని కలవరిస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే వచ్చిన నర్స్.. ‘రిషీ అంటే మీరేనా.. మీరు ఆవిడకు ఏం అవుతారు సార్’ అని అడగడం చూపిస్తారు. ఆ సమయంలో రిషి ఎక్స్‌ప్రెషన్ నిజంగా కంటతడి పెట్టించేలా ఉంటాయి.ఇక వెంటనే రిషి.. జగతీ కంటి నుంచి కారే కన్నీళ్లని తుడుస్తాడు.ప్రేమగా జగతీ తల నిమురుతాడు. ఇదంతా బయట నుంచి మహేంద్ర, వసు, గౌతమ్‌లు చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు.


Share

Related posts

చేతులారా `ఎన్టీఆర్ 30`ను వ‌దులుకున్న లైగ‌ర్ బ్యూటీ..ఇప్పుడు ఫీల‌వుతుందా?

kavya N

టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్ట‌మ‌న్న `లైగ‌ర్‌` బ్యూటీ.. విజ‌య్ ఫ్యాన్స్ హ‌ర్ట్‌!

kavya N

మళ్లీ చాలాకాలం తర్వాత రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ..!!

sekhar