NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 29 Today Episode:జగతి చేతిలో విడాకుల పత్రాలు… ఇది నా బాధ్యత అంటున్న రిషి.!

Guppedantha Manasu November 29 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 29వ తేదీ Guppedantha Manasu సీరియల్ 620వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం
జగతీ, మహేంద్రలు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంటికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలని డిశ్చార్జ్ ఏర్పాట్లు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుకు సాగిందనే చెప్పాలి.

దేవయానిలో మొదలైన కంగారు :

Devayani

నేటి కథనంలో ఫణేంద్ర, ధరణీలు.. జగతీ, మహేంద్రలు తిరిగి రావడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన దేవయాని.. ‘నేను వాళ్ల రాకకోసం చాలా ఎదురు చూస్తున్నా’ అంటుంది వెటకారంగా. ఆ మాటల సందర్భంలోనే… ఫణేంద్ర అసలు జగతీ వాళ్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ముందుగా తెలుసుకోవాలి.. తెలుసుకుంటాను..అనేసి అక్కడ నుండి వెళ్తాడు. ఇక దేవయానికి ఆ మాటలకు చాలా కంగారు పడుతుంది. దేవయాని భయాన్ని ముందే గమనించిన ధరణీ.. ‘అత్తయ్యగారు.. నాకు చాలా భయంగా ఉంది కారణం ఎవరో తెలుసుకుంటాను అన్నారు కదా.. మీరు దొరకేస్తారేమో’ అంటుంది అమాయకంగా ముఖం పెట్టి. ‘నువ్వే బయటపెట్టేలా ఉన్నావ్ ధరణీ.. అయినా మనం ఫ్రెండ్స్ కదా ఇలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ధరణి అంటూ లేనిపోని ప్రేమ వలకబోస్తుంది దేవయాని.

నా కొడుకు కోసం తిరిగివచ్చా అంటున్న జగతి :

Vasujagathi

ఇక ఆసుపత్రిలో జగతికి జ్యూసు ఇస్తూ.. ప్రేమగా కబుర్లు చెబుతుంది వసు. ‘రిషి సార్ మీరు వెళ్లాక ఎంత బాధపట్టారో తెలుసా? అలా ఎందుకు వెళ్లారు మేడమ్’ అంటుంది వసు. ‘మహేంద్ర మాట కాదనలేక వెళ్లాను.. అదే భార్య భర్తల బంధం అంటే ఈ బంధం గురించి నీకు ఎంత చెప్పినా ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. వెళ్లిన దాన్ని ఎందుకొచ్చాననే కదా.. నీ అనుమానం.. రిషి మెయిల్ చేశాడు.. నీకోసం’ అంటూ అసలు నిజం చెబుతుంది. దాంతో వసు చాలా సంబరపడిపోతుంది.

జగతి చేతిలో విడాకులు :

Jagathi

ఇక జగతీ మాత్రం చాలా ఎమోషనల్‌గా.. ‘రిషిని చిన్నప్పటి నుంచి తనకు ఏది కావాలంటే అది కొనిచ్చేదాన్ని. తను అడిగితే ఏది కాదు అనలేదు.. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నా కొడుకు ఏది అడిగితే ఇవ్వడమే నాకు తెలుసు’ అంటూ జగతీ చాలా ఎమోషనల్ అవుతుంది.చిన్నప్పుడు ఎందుకు వదిలేసి వెళ్లాను అనుకుంటావేమో.. నేను వెళ్లలేదు వసు పంపించబడ్డాను’ అంటూ గతంలో జరిగిన ఒక సీన్ తలుచుకుంటుంది.ఆ సీన్‌లో.. దేవయాని, జగతీ, మహేంద్ర ముగ్గురూ కనిపిస్తారు. జగతీ చేతుల్లో విడాకుల పత్రం ఉంటుంది. ‘ఏంటి విడాకులా?’ అంటుంది ఆవేదనగా జగతీ. ‘అవును.. ఈ రోజుతో ఈ బంధాన్ని తెంపేస్తున్నాను’ అంటుంది పొగరుగా దేవయాని. ‘మీరు అడుగుతున్నది నా ప్రాణం అక్కయ్యా అని జగతి అని…ఈ క్షణం నుంచి మీ కుటుంబానికి దూరంగా వెళ్లిపోతాను’ అంటుంది ‘జగతీ ప్లీజ్ జగతీ ప్లీజ్ వెళ్లొద్దు’ అంటూ మహేంద్ర అరుస్తూనే ఉంటాడు కానీ జగతీ ఆగదు.

తన బాధ్యతను నిర్వర్తించిన రిషి:

Rishi

ఆ సీన్ గుర్తు చేసుకుంటూ జగతీ వసుకి జరిగింది చెబుతుంది. ఇంతలో రిషి, మహేంద్ర వాళ్లు రూమ్‌లోకి వస్తారు.ఇక ఎంతో మంచి వాడైనా రిషిని నాకు అప్పచెప్పినందుకు థాంక్స్ మేడం అంటుంది. వసు.ఇక గౌతమ్.. డిశ్చార్జ్‌కి అన్ని ఏర్పాట్లు చేసి బిల్ పేమెంట్ గురించి రిషితో చెప్పగానే వెంటనే రిషి తన కార్డ్ ఇచ్చి జగతీనీ డిశ్చార్జ్ చేయించడంతో. జగతి చాలా సంతోషిస్తుంది.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri