NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu 21 October,583 Episode: ఒక్కటైన వసు, రిషి… ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న జగతి, మహేంద్ర..!

Guppedantha Manasu October 21Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 583వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 22న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో దేవయాని రిషి మీద తనకు ఉన్న దొంగ ప్రేమను చూపిస్తూ మహేంద్ర, జగతిలను తప్పు పట్టేలా మాట్లాడుతుంది.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.దేవయాని మాటలు నిజం అని నమ్మిన రిషి…డాడ్ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు.. మీరు కూడా మారిపోతారనిపిస్తుంది నాకు అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. రిషి మాటలు విని మహేంద్ర చాలా బాధపడతాడు.ఆ తర్వాత దేవయాని కావాలనే జగతీ, మహేంద్రలను నానా మాటలు అంటుంది. రిషి ప్రేమకి.. రిషి జీవితానికి మీరిద్దరే పెద్ద శత్రువులు. గురుదక్షిణ ఒప్పందమే లేకపోతే రిషి, వసు ఈ పాటికి కలిపిపోయేవారు..సో దీని బట్టి వాళ్లకి మీరే అడ్డంకి అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

ఇల్లు వదిలి వెళ్ళిపోనున్న మహేంద్ర, జగతి :

jagathi mahendra

దేవయాని మాటలకు జగతీ, మహేంద్రలు చాలా ఏడుస్తారు.ఇక మహేంద్ర బాధపడుతూనే రిషికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ రిషి మనల్ని ఎప్పటికీ అర్థం చేసుకోడా జగతీ.? దేవయాని వదిన మాటలకు మనం సమాధానం ఇవ్వాలి జగతీ మనం ఇక్కడ నుండి వెళ్లిపోదాం జగతీ అంటాడు మహేంద్ర ఆవేశంగా.మహేంద్ర అలా అంటావేంటి రిషి అక్కయ్య మాయలో ఉన్నాడు..ఇదంతా నా వల్లే.. నువ్వు కూడా రిషిని వదిలేసి వచ్చేస్తే ఎలా అని సర్ది చెబుతుంది.

వసు, రిషిల రొమాన్స్ సూపర్ :

Vasu rishi romance



సీన్ కట్ చేస్తే.. రిషి, వసులు కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు. ఓ చోట ఆగి ఒకరి వీపుకు ఒకరు ఆనుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ఈ సమయం నాకు చాలా ఆనందంగా ఉంది వసుధార’అంటాడు రిషి. అందుకే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా మన ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి కారులో పెట్టేశాను అంటుంది వసు. రిషి షాక్ అవుతూ అవునా అంటూ వెనక్కి తిరగడంతో వసు రిషి ఒడిలోకి వాలిపోతుంది. ఆ సమయంలో ఇద్దరి చూపులు కలుస్తాయి ఆ సీన్ చూడడానికి కాస్త రొమాంటిక్ గా ఉంటుంది.తర్వాత ఇద్దరూ తేరుకుని.. నార్మల్‌గా కూర్చుని చాలా సేపు కబుర్లు చెప్పుకుంటారు. ‘నువ్వు నాకు స్పెషల్ కదా వసుధార.. అందుకే నీకు ముద్దుగా పొగరు అని పేరు పెట్టుకున్నాు.. పొగరు అంటే తిట్టు అనుకున్నావా? కాదు.. ప్రేమ.. ఈ పిలుపు నాకే సొంతం..’ అంటాడు ‘ఈ రోజు ఏంటో గుండె తట్టుకోలేనంత ఆనందంగా ఉంది అంటుంది వసు. ‘కానీ ఇలాంటప్పుడే భయమేస్తుంది నాకు అంటాడు రిషి. ‘భయమెందుకు సార్.?’ అంటుంది వసు. ‘నేను ఎవరిని ఇష్టపడినా వాళ్లు నాకు దూరం అయిపోతున్నారు ఏంటో మనం కూడా అని ఆవేదనగా అనబోతుంటే సార్.. అలా అనకండి సార్..’ అంటూ తన చేతిని రిషి నోటికి అడ్డం పెడుతుంది వసు.అయినా నాకంటూ నేను ఇష్టపడేవాళ్లు ఎవరు ఉన్నారు.? నువ్వు డాడ్ అంతే కదా.. డాడ్‌ అంటే నాకు ప్రాణం. డాడ్ నన్ను చూడకుండా ఉండలేరు తెలుసా?’ అంటూ మహేంద్ర గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు రిషి.

కొడుకుని ఒంటరి చేసి వెళ్లిపోతున్న మహేంద్ర :

Mahendra jagathi

మరోపక్క మహేంద్ర ఎంతో బాధగా రిషి, మహేంద్రలు కలిసి దిగిన ఫొటో ఫ్రేమ్ చూసుకుంటూ. ‘మారిపోతున్నాను అన్నావ్ కదా నాన్నా.. మారిపోయానో.. పారిపోతున్నానో..అంటూ ఎమోషనల్‌గా ఆ ఫొటోకి ముద్దు పెట్టుకుని ఫ్రేమ్ నుంచి ఆ ఫొటో తీసి తన జేబులో పెట్టుకుంటాడు. ఆ ఫ్రేమ్ మీద ఏదో రాస్తాడు. ఇక జగతీ, మహేంద్రలు చాలా బాధగా బట్టలు సర్దుకుని కారు దగ్గరకు వెళ్లి వెనక్కితిరిగి చూసుకుంటూ కారు ఎక్కుతారు. అదే సమయంలో వాళ్లను దేవయాని చాటుగా చూసి నవ్వుకుని లోపలికి వెళ్లిపోతుంది.

Guppedantha Manasu October 21Today Episode:దిక్కుతోచని స్థితిలో రిషి :

Vasu rishi

ఇక రిషి, వసులు తిరిగి కారులోఇంటికి బయలుదేరతారు. అదే సమయంలోజగతీ, మహేంద్రలు కూడా కారులో ఎటో వెళ్లిపోతూ ఉంటారు. మొత్తానికీ ఈరోజు ఎపిసోడ్ కాస్త బాధగా మరికాస్త సంతోషంగా ముగిసిందనే చెప్పాలి.అమ్మాయి ప్రేమ దక్కిందని రిషి సంతోషపడాలో లేకపోతే నాన్న ప్రేమ దూరం అయింది అని బాధ పడాలో తెలియని అయోమయంలో ఈరోజు కథనం చాలా ఎమోషనల్‌గా సాగింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu