Guppedantha Manasu:గుప్పెడంత మనసు సీరియల్ తో మనందరికీ పరిచయమైన వసుధార( రక్షా గౌడ)అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు స్టార్ మా లో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో కన్నా గుప్పెడంత మనసు సీరియల్ కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు ప్రేక్షకులు, ఇందులో నటించే ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని చెప్పుకోవాలి. ఈ సీరియల్ లో వసుధార,రిషి క్యారెక్టర్లలో ముఖేష్ గౌడ, రక్షా గౌడ,వీళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా నటిస్తూ అభిమానుల్ని అలరిస్తూ ఉన్నారు. వసుధార మంచి నటనతో, ఈ సీరియల్లో తన అందం అభినయంతో, ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.తాజా గా, రక్షా గౌడ ప్రకృతి విలేజ్ యాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటుడు ఆలీతో పాటు, రిషి వసుదార లు కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వసు కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది అభిమానులతో, విలేకరులు అడిగిన ప్రశ్నలకు వసు చాలా చక్కగా సమాధానం చెప్పింది. ” గుప్పెడంత మనసు సీరియల్ టైమింగ్ మార్చడం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు వసు టైమింగ్ మార్చినంత మాత్రాన మా సీరియల్ కి రేటింగ్ పడిపోలేదు” అంతకుముందు ఏడు గంటలకి ప్రసారం చేసేవాళ్లు ఇప్పుడు కొత్త సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ప్రసారం చేయడం వల్ల గుప్పెడంత మనసు టైమింగ్ మార్చి సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేస్తున్నారు.

6 గంటలకి ఆఫీస్ నుంచి వచ్చే మహిళలు చూడ్డం ఇబ్బందిగా ఉంటుందని విలేకరి అడిగిన ప్రశ్నలకు రక్షా గౌడ స్లాట్, టైమింగ్ ఏదైనా కానీ మేమే టాప్ అనే సమాధానం చెప్పింది.కావాలని టైమింగ్ మార్చలేదు అనుకోని కారణాల వల్ల అలా మారించాల్సి వచ్చింది అయినా కానీ ప్రేక్షకులు మంచిగా ఆదరిస్తున్నారు అని చెప్పుకొచ్చింది వసు.ఎక్కడికి వెళ్లినా నన్ను వసుధారగానే గుర్తిస్తున్నారు వసుధరా అని పిలుస్తూ ఉంటారు. ఇంత గుర్తింపు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని, మా సీరియల్ కి ఎప్పుడు ఆదరణ ఉంటుందిఅని చెప్పుకొచ్చింది వసుధార.

రిషి జగతి, మహీంద్రా, వీరిలో మీకు ఎక్కువగా ఎవరు అంటే ఇష్టమని విలేకరి అడిగిన ప్రశ్నకి నాకు ముగ్గురు ఇష్టమే ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుబంధం ఉంటుంది అని సమాధానం చెప్పింది. మా పాత్రలు జనాల్లోకి బాగా వెళ్లాయని ఎక్కడకి వెళ్ళినా మంచి గుర్తింపు వస్తుందని, సీరియల్లో “నేను రిషి గారిని ఏడిపిస్తే రిషి గారు నన్ను బయట ఏడిపిస్తూ ఉంటారు” అని నవ్వుతూ సెట్లో లెండి అని సమాధానం చెప్పింది.

రిషి గారు సీరియల్ లో అలా సీరియస్ గా కనిపించిన బయట మాత్రం చాలా జోగెల్ గా ఉంటారని తనతో చాలా స్నేహంగా ఉంటారని చెప్పుకొచ్చింది వసుధార. ఈమె కొన్ని రోజుల్లోవెండి తెర మీద కూడా మెరువబోతున్నట్టు ఒక కన్నడ సినిమాలో నటించబోతున్నట్లు చెప్పుకొచ్చింది. వసుధారకి సీరియల్ తో పాటు సినిమా పరిశ్రమలో కూడా మంచి ఆదరణ లభించాలని కోరుకుందాం.