NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha manasu : రిషి ప్రేమకి అడ్డుగా జగతి… గురుదక్షణ విషయంలో తగ్గేదేలే అంటున్న వసు..!!

Guppedantha Manasu October 20Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 585వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 20న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో దేవయాని మరొక సరికొత్త నాటకానికి తెర లేపుతుంది. వసు దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చేయ్ రిషికి నీకు పెళ్లి చేస్తా అని అంటుంది. వసు రాను మేడం అని అనడంతో ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి చూస్తుంది ఈ క్రమలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా ముందుగా సాగిందనే చెప్పాలి. వసు ఇంటి దగ్గర నుండి దేవయానిని తన కారులో ఎక్కించుకుని రిషి బయలుదేరతాడు అప్పుడే దారిలో దేవయాని దొంగ ఏడుపులు మొదలుపెడుతుంది.

రిషిపై దేవయాని దొంగ ప్రేమ :

Guppedantha Manasu Today Episode 586
Devayani cunning mind


దాంతో రిషి కారు పక్కకు ఆపుతాడు. ‘నా పెద్దరికాన్ని పక్కనపెట్టి మరీ బతిమలాడాను.. ఆ వసుధార చెబుతుంటే వినట్లేదు కదా.? ఏం చేద్దాం చెప్పు’ అంటూ దేవయాని దొంగ ఏడుపు ఏడుస్తుంది. ‘పెద్దమ్మా.. వసుధార తన ధోరణి మార్చుకుని తప్పకుండా వస్తుంది.. మీరు చూసే వసుధార వేరు.. నాకు అర్థమవుతున్న వసుధార వేరు. జగతీ మేడమ్‌ మీద తనకి కృత‌జ్ఞత ఉంది. అంతకంటే ఎక్కువ ప్రేమ నా మీద ఉంది. ఎప్పటికైనా ఆ ప్రేమ గెలుస్తుంది పెద్దమ్మా.. మీరు బాధపడకండి అంటాడు.కచ్చితంగా తను మన ఇంటి కోడలిగా వస్తుంది’ అంటాడు రిషి.ఇక దేవయాని మాత్రం మనసులో రగిలిపోతుంది.

తగ్గేదేలే అంటున్న వసు :

Vasu jagathi


ఇక వసును కాలేజ్ దగ్గర కలిసిన జగతి, మహేంద్రలు రిషి గురించి అడగగా దేవయాని వచ్చి తీసుకుని వెళ్లిన విషయం చెబుతారు. అలాగే దేవయాని వచ్చి వసుతో ఏమి మాట్లాడిందో అనే విషయం కూడా చెబుతుంది వసు… ఇక జగతి, మహేంద్ర కంగారు పడతారు.జగతి వసుకు సారీ చెప్పి ఇంకా అయినా నీ మొండి పట్టుదల వదలవా అంటే వదలను మేడం అంటుంది. జగతి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.అక్కడే ఉన్న గౌతమ్ ఎందుకు వసుధర రిషి సంగతి నీకు తెలుసు కదా వాడు మొండివాడు.. మారడు. అనవసరంగా మీ మధ్య గొడవలు అంటే లేదు సార్ నేను అంతకన్నా మొండిదాన్ని అంటుంది వసు.

జగతిని, మహేంద్రను అవమానించిన దేవయాని :

Devayani drama


ఇక రాత్రి అయ్యేసరికి రిషి తనలో తానే వసుని కలుద్దామా అనుకుని వస్తున్నా అంటూ మెసేజ్ చేస్తాడు. రండి అంటూ వసు అనడంతో రిషి బయలుదేరే ప్రయత్నంలో ఉంటాడు. అప్పుడే మహేంద్ర,జగతీలు ఇంటికి చేరతారు. అప్పటికే ‘మీ డాడీకి,ఆ జగతీకి నువ్వు ఏం అయిపోయిన ఫర్వేలేదు నాన్నా.. కానీ నాకు నువ్వు ముఖ్యం.. నీ సంతోషం ముఖ్యం’ అంటూ బాగానే ఎక్కిస్తుంది దేవయాని. అయితే దేవయాని కావాలనే రిషి రూమ్ ముందు నిలబడి గదిలోకి వెళ్తున్న మహేంద్రను ఆపుతుంది. ‘రిషిని ఇబ్బంది పెట్టకు ఇప్పుడు తన రూమ్‌లోకి వెళ్లకు’ అంటూ అడ్డుపడుతుంది. మహేంద్ర వెంటనే వదినగారు నా కొడుకు రూమ్‌లోకి నన్ను వెళ్లొద్దు అనడానికి మీరు ఎవరు?’ అంటాడంతే మహేంద్ర. సరిగ్గా అప్పుడే రిషి తలుపుతీయడంతో దేవయాని దొంగ ఏడుపు అందుకుంటుంది. ‘ఎంత మాట అన్నావ్ మహేంద్ర.. రిషి నాకేం కాడనేగా నీ ఉద్దేశం అంటూ ఇంకా రెచ్చిపోతుంది.రిషి కోపంగా వాళ్ల దగ్గరకు వచ్చి.. ఆవేశంగా ‘డాడ్ ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు.. సారీ పెద్దమ్మా’ అంటూ అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు

రిషి ప్రేమకు అడ్డుగా జగతి :

Rishi angry

వెంటనే దేయవాని కావాలనే ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయా? కడుపు నిండిందా? హాయిగా ఉందా?’ అంటుంది. ‘వదినా అని అరుస్తాడు మహేంద్ర. ‘హా వదిన్నే.. రిషి ఇంటికి రాలేదు ఇప్పుడే వచ్చాడు.. మీరు ఎలా మాట్లాడాలి? తనని ఎంత అపురూపంగా చూసుకోవాలి..’ అంటుంది దేవయాని.అసలు రిషి ఆనందంగా ఉండటం ఇష్టం లేదా?’ అంటుంది దేవయాని. ‘వదినా అన్నీ మీరే అంటారు.మళ్లీ అవన్నే మేమే అన్నామని నమ్మిస్తారు.గొప్పోళ్లు వదినా అంటాడు మహేంద్ర ఆవేదనగా.నేను కాదు మహేంద్ర.. గొప్పవాళ్లకే గొప్పవాళ్లు మీరు అసలు మీ ఇద్దరి వల్లే కదా రిషికి అలా అవుతోంది.. రిషి సరదాగా మాట్లాడి ఎన్నాళ్లు అయ్యిందో కదా.. ఆ విషయం మీరు ఆలోచించారా? ఆలోచించరు అంటుంది.‘అక్కయ్యా ఏంటి మీ ఉద్దేశం’అంటుంది జగతి. దాంతో జగతి మీద రెచ్చిపోతుంది దేవయాని. ‘నీ కాలు ఈ ఇంట్లో మోపాక అన్నీ ఆగిపోయాయి కొందరి లెగ్ మహిమ అలా ఉంటుంది మరి. నువ్వు వెళ్లావ్.. ఏదో నా తిప్పలు నా బాధలు నేను పడ్డాను.. మళ్లీ నువ్వు వచ్చావ్.. రిషి బాధపడుతున్నాడు అంటుంది దేవయాని.వదినగారుమీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటాడు మహేంద్ర ఆవేదనగా. ‘మహేంద్ర ప్లీజ్ నువ్వు ఆగు.. గొడవ వద్దు ప్లీజ్..’ అంటుంది జగతి. మీరే కాస్త ఆలోచించండి రిషి ప్రేమకి,రిషి జీవితానికి మీరిద్దరే పెద్ద శత్రువులు.గురుదక్షిణ ఒప్పందమే లేకపోతే రిషి, వసు ఈ పాటికి కలిపిపోయేవారు..సో దీని బట్టి వాళ్లకి మీరే అడ్డంకి అంటూ ఇద్దరినీ దోషులగా చేసి మాట్లాడుతుంది దేవయాని. పాపం జగతి ఎంతగానో బాధ పడుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella