Guppedantha Manasu సెప్టెంబర్ 13 ఎపిసోడ్: మీ మాటలు నాకు గందరగోళంగా అనిపిస్తున్నాయి మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు రిషి పంతులు గారిని వెనక్కు పిలిపించి ముహూర్తం పెట్టించమంటావా అని విశ్వ అంటాడు ఏమీ వద్దు సార్ ఏంజెల్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నువ్వు నా స్నేహితురాలి వి నీ మంచి కోరే చెబుతున్నాను అని రిషి అంటాడు. అదేంటి రిషి అలా మాట్లాడతావ్ నిన్ను అడిగే కదా ఈ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పాను నువ్వు ఒప్పుకున్నావు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావ్ అని విశ్వ అంటాడు.

సార్ నేను ఒప్పుకోలేదు సార్ ఒప్పుకున్నాను అని మీరు అనుకుంటున్నారు నిజానికి ఆ రోజే మీకు ఆ విషయం చెప్పాను కానీ మీరు నిద్రపోయారు మరుసటి రోజు కూడా నా మనసులో మాట మీతో చెప్పబోతుంటే మీరు వేరే లాగా అర్థం చేసుకున్నారు మీకు ఎలా చెప్పాలా అని రాత్రి అంతా మదన పడ్డాను చెబితే మీరు ఏమైపోతారో నని ఆలోచించాను ఈ లోపు వీళ్ళ రాక యాక్సిడెంట్ ఇవన్నీ జరిగిపోయాయి సార్ నన్ను క్షమించండి నేను ఈ పెళ్లి చేసుకోలేను అని రిషి అంటాడు. ఏంటి ఈ పెళ్లి నువ్వు చేసుకోవా అని విశ్వ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఏంటి విశ్వ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అని ఏంజెల్ అంటుంది. నేను నీకు తగినవాడును కాదు ఏంజెల్ అని రిషి అంటాడు.

నిజం చెప్పు రిషి నేను పెళ్లి చేసుకోమని నోరు తెరిచి నిన్ను అడిగినందుకు ఈ స్నేహితురాలు నీకు లోకు అయిపోయింది కదూ అందుకేనా ఏవేవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావ్ అని ఏంజెల్ అంటుంది. ఏంజెల్ నేను అలా మాట్లాడలేదు అని రిషి అంటాడు. సూటిగా ఒకటే మాట చెప్పు రిషి డొంక తిరుగుళ్ళు వద్దు అని ఏంజెల్ అంటుంది. కట్ చేస్తే ఆ ఫైల్ చూసి వాట్ నాన్సెన్స్ కోటి రూపాయల కోసం ఈ కాలేజీ నీకు రాసి ఇవ్వడమేంటి అని కాలేజ్ మేనేజ్మెంట్ అంటుంది. అవును సార్ కోటి రూపాయలు ఇచ్చి అడిగితే ఇవ్వట్లేదు అందుకే నాకే ఈ కాలేజీ చెందుతుంది అని ఎమ్మెస్ అంటాడు. డబ్బు తీసుకొని ఎక్కడికి పారిపోట్లేము కదా అని మేనేజర్ అంటాడు.

ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఇస్తే కుదరదు సార్ ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే కావాలి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు నా కోటి నాకు ఇచ్చారా సరే సరే లేదంటే కాలేజీని హ్యాండ్ వర్ చేసుకోవాల్సి ఉంటుంది అని ఎమ్మెస్ అంటాడు. కోటి రూపాయల కోసం ఈ కాలేజీ నీకు హ్యాండ్ వర్ చేస్తారని అనుకుంటున్నావా అని శైలేంద్ర వాళ్ల నాన్న అంటాడు. ఆఫ్ట్రాల్ ఆ కోటి రూపాయలు ఏమి పరువుని మీ కుటుంబాన్ని నిలబెట్టింది సార్ ఈ కాలేజీని నిలబెట్టింది కూడా ఆ కోటి రూపాయలే కావాలంటే మీ అబ్బాయిని అడగండి అని ఎమ్మెస్ అంటాడు. కట్ చేస్తే ఎంతసేపు మాట్లాడకుండా ఉంటావు రుషి నువ్వు నిజం చెప్పకపోతే మన ఇద్దరి స్నేహం మీద ఒట్టు అని ఏంజెల్ అంటుంది. రిషి ఇది నా మనవరాలు జీవితం నువ్వు మాట్లాడకుండా ఉంటే దానికి అర్థం ఏంటి రిషి అని విశ్వ అంటాడు. నాకు ఆల్రెడీ పెళ్లి అయింది నా భార్య కూడా బ్రతికే ఉంది అని రిషి అంటాడు.

నువ్వు చెప్పింది నిజమే అయితే ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు చెప్పు రిషి అని ఏంజెల్ అంటుండు. ఏం మాట్లాడవేంటి రిషి నా మనవరాలు అడుగుతుంటే అని విశ్వ అంటాడు. వసుధార రిషి భార్య ఎవరో నీకు తెలుసా అయినా నాకే తెలియదు నిన్నగాక మొన్న వచ్చావు నీకేం తెలుస్తుందిలే సార్ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది రిషి భార్య ఎవరు అని రిషి వాళ్ళ నాన్నని అడుగుతుంది ఏంజెల్ గత మూడు వారాలుగా నువ్వు ఆమె దగ్గరికి వెళ్లట్లేదు అంటే ఆమెను నువ్వు వదిలేసావా లేదంటే నిన్నే ఆవిడ వదిలేసిందా అని ఏంజెల్ అంటుంది. స్టాప్ ఇట్ ఏం మాట్లాడుతున్నావ్ ఏంజెల్ అన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్ లు వేయకు అని రిషి అంటాడు. కట్ చేస్తే ఏంటి మరి ఇంకా ఎంతసేపు నా నిరీక్షణ మీ నిర్ణయం ఏంటి అని ఎమ్మెస్ అంటాడు. ఏంటి నీకు చెప్పేది ఈ కాలేజీ కి జగతి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఆ జగతి. అయితే జగతి మేడం ని పిలిపించండి ఎక్కడికెళ్ళింది అని ఎమ్మెస్ అంటాడు. ఆవిడ ఊర్లో లేదు తను వస్తే అసలు ఒప్పుకోదు అని శైలేంద్ర వాళ్ల నాన్న అంటాడు.
ఏంటండీ ఇక్కడ ఏదో జరుగుతుందంట మన కాలేజీని ఎవరికి అప్పజెప్పాలంట ఎవరికండి అని వాళ్ళ ఆవిడ అంటుంది. మన శైలేంద్ర అతని దగ్గర డబ్బు తీసుకున్నాడు అదే అవకాశం గా తీసుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయించు కున్నాడు అని శైలేంద్ర వాళ్ల నాన్న అంటాడు అది కాదండి అగ్రిమెంట్ పక్కాగా ఉందంట అది ఎలా మారుతుంది అని వాళ్ళ ఆవిడ అంటుంది.

జగతి కచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది తన మీద నాకు ఆ నమ్మకం ఉంది కాలేజీ కుప్పకూలి పోతుందనే న్యూస్ లో ప్రకటన వచ్చినప్పుడు రెండు రోజుల్లో యాక్షన్ తీసుకుంది ఈ కాలేజీ కి ఉన్న పేరును నిలబెట్టింది జగతి అది తనకున్న పవర్ ఇప్పుడే తనకు ఫోన్ చేసి రమ్మంటాను అని శైలేంద్ర వాళ్ల నాన్న అంటాడు. చేయండి సార్ జగతి మేడం వస్తే నాకు చేయవలసిన పని ఉంది కాలేజీ ని నాకు రాసిస్తున్నట్టు సంతకం పెట్టాలి కదా అని ఎమ్మెస్ అంటాడు.ఊహల్లో తేలిపోకు అయినా నిన్ను ఇంకోసారి కాలేజీ పరిగణంలోకి రానివ్వకుండా చేస్తాము అని శైలేంద్ర వాళ్ల నాన్న అంటాడు. అయితే అది చూద్దాం ఫోన్ చేయండి మీరు అని ఎమ్మెస్ అంటాడు. ఇప్పుడే చేస్తాను ఉండండి అని శైలేంద్ర వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది