NewOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu,22 October,584 Episode: జగతి మీద కోపంతో రిషి మళ్ళీ దేవయానికి దగ్గర అవుతాడా…??

Share

Guppedantha Manasu,22 October,584 Episode:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 584వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 22న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు కలిసి తమ మనసులోని మాటలను చెప్పుకుంటూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరో వైపు దేవయాని మాటలకూ బాధపడిన మహేంద్ర జగతిని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..మహేంద్ర కారులో వెళ్తూ జగతితో, ఇదంతా కల అయితే బాగుండు జగతి రేపు ఉదయం లేచేసరికి రిషి నా కళ్ళ ముందు ఉంటాడు అని అంటాడు. దానికి జగతి బాధపడకు మహేంద్ర ఇది మనం రిషికి ఇస్తున్న కానుక అనుకుందాం అని అంటుంది.

ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మహేంద్ర, జగతి :

Jagathi, mahendra


మరోవైపు రిషి వసుధారతో కారులో వెళ్తూ వసుధార, నా జీవితంలో దేవుడు ఇచ్చిన కానుక నువ్వు అని అంటాడు. దానికి వసుధార, లేదు సార్ మీరే నాకు కానుక అని అంటుంది. అప్పుడు రిషి, ఈ రాత్రి చాలా బాగుంది వసుధార నాకు చాలా ఆనందంగా ఉన్నది అని అంటాడు. ఇంతలో ఇల్లు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోతుంది వసు . తర్వాత ఉదయాన్నే లెగిచేసరికి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులన్నీ నువ్వే చూసుకో వసు అని జగతి మెసేజ్ చేస్తుంది.ఇకనుంచి నేను ఇవేవీ చూసుకోను అని మెసేజ్ పెడుతుంది జగతి.మేడం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఫోన్ చేద్దాము అని ఫోన్ చేసేసరికి అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది.

డాడ్ ఎక్కడా అని దేవయానిని నిలదీసిన రిషి :

Advertisements
Rishi

మరోవైపు రిషి మహేంద్ర కోసం తన గదిలోకి వెళ్ళగా అక్కడ మహేంద్ర ఉండడు. డాడ్ ఏంటి ఇంత ఉదయాన్నే లేచారు అని కబోర్డు తీయగా అక్కడ బట్టలు ఏవి ఉండవు.వెళ్తున్నాము అని ఫోటో ఫ్రేమ్ లో రాసి ఉంటుంది. అది చూసి రిషి కంగారుగా కిందకు వచ్చి, పెద్దమ్మ డాడ్ ఎక్కడా అని అడగగా నేను ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు వెళ్లిపోయారు రిషి అని చెబుతుంది. అప్పుడు రిషి, వెళ్ళిపోవడం ఏంటి పెద్దమ్మ నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు అయినా మీరైనా నాకు చెప్పాలి కదా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఫోన్ చేయాలి కదా అని అంటాడు.నేను ఎంతో అడ్డుకోడానికి ప్రయత్నించాను రిషి కానీ వాళ్ళు నా మాట వినలేదు తిరిగి నన్నే అనరాని మాటలు అన్నీ అన్నారు అని దేవయాని అనగా  అంటే అన్నారు లెండి పెద్దమ్మ అంటాడు రిషి..ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది ముఖ్యం అంటాడు.

దేవయాని ప్లాన్ ఫెయిల్ అయిందా..?

Devayani, rishi


మీకు డాడ్ కి గొడవలు అయి ఉంటాయి కదా మీరు అనరాన్ని మాటలు ఏమైనా డాడ్ ని అంటే బాధపడి వెళ్లి ఉంటారా? జరిగింది చెప్పండి పెద్దమ్మ అని కోపంతో అంటాడు రిషి. దానికి దేవయాని, రిషి ఏంటి వాళ్ళు వెళ్లి పోయారు అంటే ఏడుస్తూ ఒడిలో పడుకుంటాడు అనుకుంటే నా మీదే విరుచుకుపడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది.ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగా ఇంకేమున్నది పెట్టా పేడ సర్దుకుని వెళ్ళిపోయారు జగతి, మహీంద్రలు అని గౌతమ్ తో ఎటకారిస్తూ అంటుంది దేవయాని. 
అప్పుడు గౌతమ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లుండరు నువ్వేం భయపడొద్దు రిషి నేను వెళ్లి వెతుకుతాను ధైర్యంగా ఇంట్లో ఉండు అని అంటాడు.

రిషిని ఓదార్చిన గౌతమ్ :

Rishi, gowtham

గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత రిషి, అయినా నన్ను ఎందుకు వదిలి వెళ్తారు పెద్దమ్మ నేను అసలు ఏం తప్పు చేశాననిఅని అంటాడు. ఇప్పుడు దారిలోకి వచ్చావ్ అని దేవయాని అనుకుంటుంది. అప్పుడు దేవయాని కావాలని రిషితో,  లేదు రిషి ఈ మధ్య మహేంద్రకి నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. జగతి వచ్చినప్పుడు నుంచి నిన్ను పట్టించుకోవడం లేదు అనగా…లేదు పెద్దమ్మ డాడ్ కి నేనంటే చాలా ఇష్టం డాడ్ ఎప్పుడూ నన్ను ప్రేమతో చూసుకుంటారు. నన్ను ఎప్పుడు డాడ్ వదిలేయరు నిజం చెప్పండి పెద్దమ్మ మీరు ఏమైనా అనరాని మాటలు అన్నారా డాడ్ ని లేకపోతే డాడ్ అంత బాధతో వెళ్లిపోరు కదా అసలు ఏమైంది అని అడగగా, లేదు రిషి నిజంగా నాకు తెలీదు అంటుంది.

Guppedantha Manasu,22 October,584 Episode:మహేంద్ర మీద కోపంతో మళ్ళీ దేవయానికి దగ్గర అయిన రిషి :

Devayani, rishi

ఆ తర్వాత సీన్లో గౌతమ్ వసుధార దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి, నేను వాళ్ళని వెతుకుతాను వసు.నువ్వు రిషి దగ్గర ఉండి వాడికి ధైర్యం చెప్పు అని పంపిస్తాడు. మరోవైపు రిషి దేవయానిలు మాట్లాడుకుంటూ, డాడ్ కి  నా మీద కోపం వస్తే నన్ను తిట్టే హక్కు డాడ్ కి ఉంది కదా ఎప్పుడూ నా మీద కోపం వచ్చినా సరే నన్ను తిట్టరు ఎందుకంటే నేను బాధపడతాను అని అంటాడు.కానీ. ఇలా చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి పెద్దమ్మ అని బాధపడతాడు. అప్పుడు దేవయాని మనసులో, పోనీలే పెద్దమ్మ వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు కదా నాకు మీరున్నారు అదే చాలు వాళ్ళతో నాకెందుకు అని అంటాడు అని అనుకున్నాను. కానీ రిషి ఏంటి ఇప్పటికీ వచ్చి అలా అనలేదేంటి అని అనుకుంటుంది దేవయాని.

దేవయానికి షాక్ ఇచ్చిన వసు :

Guppedantha Manasu,22 October,584 Episode:


ఇంతలో వసుధార కిందకి వచ్చి రిషి సార్ అని అరుస్తుంది. ఇంతలో రిషి,దేవయానిలు అక్కడికి వెళ్తారు. సర్ మీరు బానే ఉన్నారా అని అడగగా, డాడ్ కనిపించడం లేదు వసు.నీకు ఏమైనా తెలిసిందా అని అనగా లేదు సర్ నా ఫోన్ కూడా ఎత్తడం లేదు.మీరు ముందు ధైర్యంగా ఉండండి. గౌతమ్ సర్ వెతకడానికి వెళ్లారు కదా అని రిషిని పైకి తీసుకెళ్తుంది వసుధార. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని దేవయాని అడగగా, ధైర్యం చెప్పడానికి తీసుకెళ్తున్నాను మేడం అలాగే కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అని వసు అంటుంది. దానికి దేవయాని షాక్ అయ్యి నేను కాఫీ తేడం ఏంటి అని దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

న‌య‌న్ దంప‌తుల‌కు భారీ ఝుల‌క్‌.. అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

kavya N

Karthikadeepam: దీప కోసం వంట చేసిన కార్తీక్..అది చూసి కోపంతో రగిలిపోతున్న మోనిత..!!

Ram

హీరో నితిన్ నీ పొగడ్తలతో ముంచెత్తిన బేబమ్మ..!!

sekhar