బబ్లీ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలెక్కబోతోంది. ఓ పెద్దింటికి ఈ అమ్మడు కోడలు కాబోతోందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ `దేశముదురు` వంటి హిట్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందింది.
అయితే కొత్త హీరోయిన్ల రాకతో హన్సికకు అవకాశాలు తగ్గడంతో.. కోలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ స్టార్ హోదాను దక్కించుకుంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ పలు ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేసిన హన్సిక.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
సౌత్‌కు చెందిన ఓ బడా పొలిటీషియన్ కుమారుడితో హన్సిక ఏడడుగులు నడవబోతోందట. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన విషయాలన్నింటిని ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారని, నిశ్చితార్థం డేట్ కూడా ఖరారు చేశారని అంటున్నారు.
అలాగే ఎప్పుడైనా హన్సిక నుండి మ్యారేజ్ అప్డేట్ రావొచ్చని తెలుస్తోంది. ఇక హన్సికకు కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే.. హన్సిక స్పందించాల్సిందే.