యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలెక్కబోతోందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాజస్థాన్ జైపూర్లోని 450 ఏళ్ల పురాతన రాచకోట `ముందోతా ఫోర్ట్ ప్యాలెస్`లో హన్మిక వివాహం జరగబోతోందని, పెళ్లి కార్యక్రమాలు డిసెంబర్ 2 నుంచే ప్రారంభం అవుతాయని వార్తలు వస్తున్నాయి.
అయితే హన్సికను పెళ్లాడబోయే వరుడు ఎవరు అన్న దానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. తాజాగా ఈ సస్పెన్స్ కు తెర దించుతూ హన్సిక తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. తన స్నేహితుడైన సోహైల్ ఖతూరియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది.
అంతేకాదు, తన కాబోయే భర్త సోహైల్ ఈఫిల్ టవర్ సాక్షిగా తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలను సైతం అందరితోనూ పంచుకుంది. దీంతో హన్సికకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఖుష్బూ, శ్రియా రెడ్డి, అనుష్కశెట్టి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తదితరులు హన్సికకు ఇన్స్టా కామెంట్స్ సెక్షన్ లో విషెస్ తెలిపారు.
కాగా, సోహాల్ కతూరియా ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త. గతంలో సోహాల్, హన్సిక కలసి బిజినెస్ చేశారట. ఆ సమయంలో వీరి ఆలోచనలు, అభిరుచులు కలవడంతో.. పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధం అయ్యారట. మొత్తానికి హన్సిక, సోహైల్ జంట అదిరిపోయేలా ఉంది.