HHVM: క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా “హరీహర వీరమల్లు”. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. మొగులూల సామ్రాజ్యం కాలం నాటి చారిత్రాత్మకమైన కథతో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కెరియర్ లో ఎప్పుడు కనిపించని పాత్రలో ఈ సినిమాలో పవన్ కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు పాత కాలం నాటి యుద్ధ విద్యలు తరహాలో ఉండేటట్లు దర్శకుడు ప్లాన్ చేయటం జరిగింది.
దీంతో పవన్ ప్రాచీన యుద్ద విద్యలు కూడా నేర్చుకోవడం జరిగింది. “హరిహర వీరమల్లు” సినిమా స్టార్ట్ చేసిన ప్రారంభంలో సర్వయుగంలో షూటింగ్ జరుపుకోగా ఆ తర్వాత కరోనా రావటంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు… షూటింగ్ లకు అనేక ఆవంతరాలు ఎదురయ్యాయి. అయితే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన తేదీకి విడుదల చేయాలని .. నిర్మాతలు .. గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ.
అందరూ హీరోయిన్ లు అందంగా ఉన్నారా..? లేదా..? అనేది చూస్తారు. రాబోయే సినిమాలో హీరోయిన్ ల పని గ్లామర్ షో చేయటమే. నేను గ్లామర్ షో చేయడానికి వెనుకాడను అని కరాకండిగా చెప్పేసింది. ఈ సినిమాలో రాణి పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. “ఖుషి” సినిమా నిర్మాత ఏ.ఏం.రత్నం ఈ సినిమా నిర్మాత కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ మరికొంతమంది నటీనటులు పాల్గొనడం జరిగింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!