టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గత కొంతకాలం నుంచి వరస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. 2020 లో విడుదలైన `భీష్మ` తర్వాత నితిన్ హిట్ ముఖమే చూడలేదు. రీసెంట్ గా ఈయన `మాచర్ల నియోజకవర్గం` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్‌లో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
ఆగస్టు 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ఇకపోతే థియేటర్స్ లో విడుదలై మూడు నెలలు గడిచిపోతున్న ఈ చిత్రం ఇప్పటివరకు ఓటీటీలోకి రాకపోవడం విచిత్రంగా మారింది.

అయితే `మాచర్ల నియోజకవర్గం` డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం అని టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందు ఓ ప్రముఖ ఓటీటీ సమస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తీసుకునేందుకు మంచి ఆఫర్ ఇచ్చిందట.
కానీ రిలీజ్ తర్వాత సదరు సమస్థ నిర్వాహకులు సగానికి సగం రేటు తగ్గించేసి అడిగారట. దాంతో అనుకున్న రేటు కంటే బాగా తక్కువ ఉండడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారట. అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనేందుకు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. నెటిజన్లు మాత్రం అరరే పాపం నితిన్ సినిమాకు అలాంటి పరిస్థితి వచ్చిందా..? అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఏంటి అంజలి? మరీ ఇంత సన్నగా అయ్యావు?