Hero Nani: న్యాచురల్ స్టార్ నాని ఇటీవల `అంటే..సుందరానికీ`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 10న విడుదలై.. మంచి స్పందనను దక్కించుకుంది.
అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ మూవీ జోరు చూపించలేకపోతోంది. మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయింది. కానీ, యూఎస్‌లో మాత్రం ఈ చిత్రం అదరగొట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నాని ఓ క్రేజీ ఫీట్ అందుకున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలు విషయం ఏంటంటే.. అమెరికాలో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమంటే నాని కెరీర్లో వన్ మిలియన్ మార్క్ అందుకున్న ఏడో చిత్రమిది. వాస్తవానికి యూఎస్‌లో వన్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించిన సినిమాల్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబువే ఎక్కువగా ఉన్నాయి.
మొన్న విడుదలైన `సర్కారు వారి పాట`తో సహా మహేశ్ నటించిన 9 సినిమాలు వన్ మిలియన్ వసూళ్లు సాధించాయి. ఆ తర్వాత వన్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించిన అత్యధిక సినిమాలు నానివే ఉన్నాయి. టాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్స్‌కు కూడా సొంతం కాని ఈ రికార్డును న్యాచురల్ స్టార్ దక్కించుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!