20.7 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

చిట్టి హైట్‌ను మ్యాచ్ చేసేందుకు నాని చిలిపి ప‌ని.. వైర‌ల్‌గా మారిన వీడియో!

Share

`జాతిరత్నాలు` సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా త్వరలోనే `లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్` అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు.

నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, అమృతా క్రియేష‌న్స్ బ్యానర్‌లపై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోనిని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని హాజరయ్యారు.

like share subscribe movie pre release event
like share subscribe movie pre release event

అయితే ఫరియా సహజంగానే చాలా హైట్ గా ఉంటుంది. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్న నాని చెప్పులు వేసుకోకపోవడంతో.. ఫ‌రియా పక్కన తక్కువ హైట్‌ తో కనిపించారు. ఈ క్రమంలోనే మీడియా ప్రముఖులు ఫోటోస్ తీస్తుండగా.. నాని కావాలని అరికాళ్ళను పైపైకి ఎత్తుతూ చిట్టి హైట్ ను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించారు.

నాని చేసిన చిలిపి పనికి పక్కనే ఉన్న ఫ‌రియాతో పాటు మీడియా ప్ర‌ముఖులు కూడా న‌వ్వేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటిజ‌న్ల‌ను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఒక హీరోయిన్ హైట్ మ్యాచ్ చేసుకోవడానికి నాని చేసిన ప్రయత్నం అంద‌రినీ బాగా అలరిస్తుంది.

https://www.instagram.com/reel/CkTawuYpZT0/?utm_source=ig_web_copy_link


Share

Related posts

తాతమనవళ్లుగా ప్ర‌భాస్.. మారుతి చిత్రంపై పెరుగుతున్న అంచ‌నాలు!

kavya N

Krishna Mukunda Murari: ఆదర్శ్ ముకుందా పెళ్లికి మురారి.. సూపర్ ట్విస్ట్.!

bharani jella

ఆయ‌న పాత్ర‌లో విల్‌స్మిత్‌

Siva Prasad