Ante Sundaraniki: న్యాచురల్ స్టార్ నాని నుంచి వస్తోన్న తాజా చిత్రం `అంటే..సుందరానికీ!`. `మెంటల్ మదిలో`, `బ్రోచేవారెవరురా` సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మలయాళ భామ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటించింది.
మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ సాగర్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రేపు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోందీ చిత్రం. ఇప్పటికే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే సుందరుడిని ప్రమోట్ చేయడం కోసం నాని భార్య అంజన కూడా రంగంలోకి దిగింది. సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ కి నజ్రియా, అంజనా కలిసి మొదట స్టెప్పులేశారు. మధ్యలో నాని కూడా జత కలిసి డ్యాన్స్ ఇరగదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నజ్రియా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
ఈ వీడియోలో నాని వైఫ్ అంజనా డ్యాన్సు చూస్తే ఎవరికైనా ఫిదా అవ్వాల్సిందే. అంత అద్భుతంగా ఆమె స్టెప్పులేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది. కాగా, లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువకుడు సుందర్ ప్రసాద్ గా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా అలరించబోతున్నారు.
https://www.instagram.com/reel/CejYdFPI5jP/?utm_source=ig_web_copy_link
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!