Hero Nani: `శ్యామ్ సింగరాయ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత `అంటే..సుందరానికీ`తో ప్రేక్షకులను పలకరించాడు న్యాచురల్ స్టార్ నాని. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.
నరేశ్, నదియా, రోహిణి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 10న విడుదలై.. మంచి స్పందనను దక్కించుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం ఊహించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ఇక తాజాగా ఈ మూవీ బక్సాఫీస్ రన్ పూర్తవడంతో.. క్లోజింగ్ కలెక్షన్స్ లెక్కలు బయటకు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ.21.22 కోట్ల షేర్ తో రాబట్టి సరిపెట్టుకుంది. దీంతో బయ్యర్స్ కు రూ.9.08 కోట్ల నష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ.. అడివి శేష్ `మేజర్`, కమల్ హాసన్ `విక్రమ్` చిత్రాలు పోటీలో ఉన్నాయి. వాటి ప్రభావం నాని సినిమా కలెక్షన్స్‌పై భారీగా పడింది. అందుకే నష్టాలు వాటిల్లాయని అంటున్నారు. ఇకపోతే ఏరియాల వారీగా `అంటే..సుందరానికీ` క్లోజింగ్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం – రూ. 6.22 కోట్లు
సీడెడ్ – రూ. 1.32 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.70 కోట్లు
ఈస్ట్ – రూ. 1.02 కోట్లు
వెస్ట్ – రూ. 0.85కోట్లు
గుంటూరు – రూ. 1.00 కోట్లు
కృష్ణా – రూ. 1.01 కోట్లు
నెల్లూరు – రూ. 0.62 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ=13.74కోట్లు
—————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1.70 కోట్లు
ఓవర్సీస్ – 5.78 కోట్లు
—————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 21.22 కోట్లు
—————————-
కాగా, ఈ మూవీ ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 10 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా ఇప్పటకే బటయకు వచ్చింది
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…