Entertainment News సినిమా

`కార్తికేయ 2` ఎఫెక్ట్‌.. భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన నిఖిల్‌?!

Share

యంగ్ స్టార్ నిఖిల్ సిద్ధార్థ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఈయ‌న‌.. రీసెంట్ గా `కార్తికేయ 2` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. 2014లో విడుద‌లైన `కార్తికేయ‌` కు ఇది సీక్వెల్‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అలాగే ఇందులో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ కు జోడీగా న‌టించింది. చాలా కాలం క్రితమే `కార్తికేయ 2` సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయ్యింది. కానీ, వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూనే వ‌చ్చింది. అయితే లేటుగా వచ్చినా లేటెస్టుగా హిట్టు కొట్టాడు నిఖిల్. ఆగ‌స్టు 13న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. సౌత్ తో పాటు నార్త్ ప్రేక్ష‌కుల‌ను కూడా విశేషంగా ఆక‌ట్టుకుంది. తొలి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. ఇక టాక్ అనుకూలంగా రావ‌డంతో.. బ‌రిలో ఎవ‌రున్నా స‌రే `కార్తికేయ 2` అదిరిపోయే క‌లెక్ష‌న్స్ ను రాబ‌డుతోంది.

ఇప్ప‌టికే రూ. 36.55 కోట్ల రేంజ్ లాభాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ లిస్ట్ లో చేరిన ఈ చిత్రం.. రిలీజ్ అయిన 17 రోజుల త‌ర్వాత కూడా బెటర్ గా హోల్డ్ చేసి సూపర్బ్ కలెక్షన్స్ ని అందుకుంటోంది. `కార్తికేయ 2` ఊహించని స్థాయిలో విజ‌యం సాధించ‌డంతో స్టార్ డైరెక్ట‌ర్స్ కూడా నిఖిల్ తో సినిమాలు చేసేందుకు పోటీ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నిఖిల్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేశాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కు ముందు ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకునే నిఖిల్‌.. ఇప్పుడు రూ. 10 కోట్ల నుంచి 12 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ను డిమాండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక `కార్తికేయ 2` ద్వారా నిఖిల్ కు పాన్ ఇండియా స్థాయిలో మంచి మార్కెట్ ఏర్ప‌డ‌టంతో.. నిర్మాత‌లు సైతం ఆయ‌న అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, నిఖిల్ త్వ‌ర‌లోనే `18 పేజెస్‌`తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులోనూ అనుపమనే హీరోయిన్ గా న‌టించింది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌గా.. ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. జిఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం సెప్టెబ‌ర్ 9న రిలీజ్ కానుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రి ఈ మూవీతో నిఖిల్ మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకుంటాడా..? లేదా..? అన్న‌ది చూడాలి.


Share

Related posts

మ‌హేశ్‌కు విల‌న్‌గా ఆ స్టార్ హీరోనా..? నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పండ‌గే!

kavya N

ర‌వితేజ చిత్రంలో…

Siva Prasad

కల సాకారమైంది

Siva Prasad