టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తండ్రి కాబోతున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె డాక్టర్ షాలినితో గత కొన్నేళ్ల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్న నితిన్.. గత ఏడాది ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టాడు.
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో నితిన్, షాలినిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ దంపతులకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. నితిన్ సతీమణి షాలిని గర్బం దాల్చిందట. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందని.. నితిన్ తండ్రి కాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే నితిన్ ఇంట దీపావళి పండుగ కంటే ముందే సంబరాలు షురూ అయ్యాయని అంటున్నారు. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో అన్నది తెలియాలంటే నితిన్ దంపతులు స్పందించాల్సిందే. కాగా, నితిన్ కెరీర్ విషయానికి వస్తే.. గత కొద్ది రోజుల నుంచి ఈయన వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు.
2020 లో విడుదలైన `భీష్మ` తర్వాత నితిన్ హిట్ ముఖమే చూడలేదు. రీసెంట్గా విడుదలైన `మాచర్ల నియోజకవర్గం` సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం నితిన్ `జూనియర్` అనే సినిమాలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.