Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Share

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తన చిన్నప్పటి క్లాస్ మేట్ నే రామ్ ప్రేమిస్తున్నాడ‌ని.. వీరి ప్రేమ‌ను ఇరు కుటుంబ‌స‌భ్యులు అంగీక‌రించ‌డంతో పెళ్లి సిద్ధ‌మ‌య్యారంటూ వార్త‌లు పుట్టుకొచ్చాయి.

అయితే ప్రియురాలితో పెళ్లి అంటూ ట్రెండ్ అవుతున్న న్యూస్‌పై హీరో రామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. `ఓరి దేవుడా.. ఆపండి. నేను నా స్కూల్ ఫ్రెండ్‌ని, సీక్రెట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటున్నాను అనే వార్తలు ఇంటి వరకు చేరాయి.. నా సొంత ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి కూడా సమాధానం చెప్పుకోవాల్సి ప‌రిస్థితి వచ్చింది.

నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు.. నిజం చెప్పాలంటే.. నేను చిన్నప్పుడు సరిగ్గా స్కూల్‌కి కూడా వెళ్లేవాడినే కాదు` అంటూ రామ్ ట్విట్ట‌ర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త‌లు పుకార్ల‌ని తెలిపోయింది. కాగా, సినిమాల విష‌య‌నికి వ‌స్తే.. ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్.లింగుస్వామితో `ది వారియ‌ర్‌` అనే సినిమా చేశాడు.

ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై 14న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ కానుంది. అలాగే ఈ మూవీ అనంత‌రం రామ్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇది పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌బోతుండ‌టం విశేషం.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

32 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

41 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago