Hero Ram: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న రామ్‌.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

Share

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నిర్మాత `స్రవంతి` రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని త‌న‌యుడే రామ్‌. మంచి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ.. త‌నదైన టాలెంట్‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రామ్ త్వ‌ర‌లోనే బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్ప‌బోతున్నాడ‌ట‌.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒక‌రైన రామ్‌.. పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. రామ్ ది ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడ‌ట‌. తన చిన్నప్పటి క్లాస్ మేట్ నే రామ్ ప్రేమిస్తున్నాడ‌ని.. వీరి ప్రేమ‌ను ఇరు కుటుంబ‌స‌భ్యులు అంగీక‌రించ‌డంతో పెళ్లి సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే రామ్ స్పందించాల్సిందే. కాగా, రామ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎన్.లింగుస్వామితో `ది వారియ‌ర్‌` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టించారు.

ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూలై 14న తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ కానుంది. అలాగే ఈ మూవీ అనంత‌రం రామ్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. రామ్ కెరీర్‌లో తెర‌కెక్క‌బోయే 20వ చిత్ర‌మిది. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ అయిన ఈ మూవీ.. మ‌రి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

13 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

36 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago