నేను లేక‌పోతే `ఇస్మార్ట్ శంక‌ర్‌` లేదు.. రామ్ కామెంట్స్ వైర‌ల్‌!

Share

`ఇస్మార్ట్ శంక‌ర్‌`.. ఈ మూవీని తెలుగు ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేరు. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మాస్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం 2019లో విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

అప్ప‌టి వ‌ర‌కు ల‌వ‌ర్ బాయ్‌గా ఉన్న రామ్‌.. ఈ మూవీతో మాస్ హీరోగా మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు, ఈ సినిమా త‌ర్వాత రామ్ మాస్ క‌థ‌ల వైపే మొగ్గు చూప్పుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక‌పోతే త్వ‌ర‌లోనే ఈయ‌న `ది వారియ‌ర్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి రూపొందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తే.. ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుండ‌గా.. రామ్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ ఇంట‌ర్వ్యూలో రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్` గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి ఒక సినిమా నా కెరియర్లో పడటం నా అదృష్టం. నేను లేకపోతే ఆ సినిమా లేదు అని పూరి గారు అనడం ఆయన సంస్కారం. కానీ ఆ సినిమాను పూరిగారు మాత్రమే తీయగలరు అనేది నా అభిప్రాయం. ఆ సినిమా మాదిరిగానే ది వారియ‌ర్‌ను కూడా ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

6 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

15 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

53 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

57 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago