టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని త్వరలోనే `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. ప్రముఖ హీరో ఆది పినిశెట్టి విలన్గా నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుసామి ఈ మూవీకి దర్శకత్వం వహించారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో రామ్ కేరీర్లో తొలి సారి పోలీస్ ఆఫీసర్గా అలరించబోతున్నాడు. సాధారణంగా హీరోలు పోలీస్ కథలంటే తెగ ఇష్టపడుతుంటారు. మాస్ ఇమేజ్ ఉన్న ప్రతీ హీరో తన కెరీర్ లో ఒక్కసారైనా పోలీస్ కథ చేయాలని ఆశపడుతుంటారు.
రామ్ `ది వారియర్` తెలుగు, తమిళ్ వర్షన్ల మధ్య తేడా ఏంటో తెలుసా?
కానీ, రామ్ మాత్రం అందుకు భిన్నం. అసలు ఆయనకు పోలీస్ కథలంటేనే ఆసక్తి ఉండదట. `ది వారియర్`కు ముందు ఆయన ఏకంగా ఐదు పోలీస్ కథలకు నో చెప్పాడట. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తెలిపాడు. రామ్ మాట్లాడుతూ.. `ది వారియర్ సినిమా చేయడానికి ముందు ఐదు పోలీస్ కథలు వినగా.. అవన్నీ ఒకేలా ఉన్నాయి.
అందుకే పోలీస్ కథలంటేనే ఆసక్తి పోయింది. కానీ, లింగుసామి మాత్రం ఇదొక పోలీస్ కథ అని చెప్పకుండా.. తనకు నెరేషన్ ఇచ్చారు. కథ విన్నాకా మతిపోయిందని, ఇలాంటి కథ కదా మనం చేయాల్సిందనిపించింది` అంటూ చెప్పుకొచ్చారు. ఈయన మాటలతో ది వారియర్పై అంచనాలు మరింత పెరిగాయి.