వ‌రుస ఫ్లాపులు.. అయినా సరే రామ్ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడా?

Share

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మంచి కంబ్యాక్ ఇచ్చిన ఈ హీరో.. ఆ త‌ర్వాత `రెడ్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక రీసెంట్‌గా `ది వారియ‌ర్‌`తో వ‌చ్చాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుసామి రూపొందించిన మాస్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తే.. ఆది పినిశెట్టి విల‌న్‌గా చేశాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లైంది. కానీ, అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయింది. మిశ్ర‌మ స్పంద‌న రావ‌డంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ ఓ మోస్త‌రు క‌లెక్ష‌న్స్‌ను వ‌సూల్ చేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 17.99 కోట్ల షేర్ ని అందుకోవాలైన అవసరం ఎంతైనా ఉంది. కానీ, అంత మొత్తంలో వ‌సూల్ చేయ‌డం క‌ష్ట‌మే. దీంతో ది వారియ‌ర్ బ‌య్య‌ర్లకు భారీ న‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. అయితే వ‌రుస ఫ్లాపుల్లోనూ రామ్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గేదే లే అంటున్నాడ‌ట‌.

ఒక్కో సినిమాకు ఈయ‌న రూ. 20 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. రామ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో చేయ‌బోతున్నాడు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరినే ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు రామ్ రూ. 20 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

 


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

56 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

59 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago