గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `దేవదాసు` మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఇక్కడ కొన్నాళ్లు చక్రం తిప్పిన తర్వాత బాలీవుడ్ కు మఖాం మార్చిన ఇలియానా.. అక్కడ కూడా సత్తా చాటాలని చూసింది. కానీ, అమ్మడి ఆశలు నెరవేరలేదు.
బాలీవుడ్లో ఆఫర్లు వచ్చినా.. ఆమె చేసిన సినిమాలేవి పెద్దగా అలరించలేకపోయాయి. దాంతో కెరీర్ ను పక్కన పెట్టి ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. అయితే ఎక్కువ కాలం వీరి బంధం కొనసాగలేదు. మనస్పర్ధలు వచ్చి వీరు విడిపోయారు. ప్రియుడితో బ్రేకప్ తర్వాత ఇలియానా కొన్నాళ్లు డిప్రెషన్లో కూడా ఉంది.
అయితే ఎలాగోలా డిప్రెషన్ నుండి బయటకు వచ్చి మళ్లీ సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే బరువు తగ్గి ఆఫర్ల కోసం వేట మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే.. ఇలియానకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇలియానా మళ్లీ ప్రేమలో పడింది అనేదే ఓ వార్త సారాంశం. ఇంతకీ ఇలియానా ప్రేమలో పడింది ఎవరితోనూ కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అన్న సెబాస్టియన్‌తో అట.
ఈనెల 16న కత్రినా కైఫ్ తన 39వ బర్త్‌డే మాల్దీవుల్లో జరుపుకుంది. కత్రినా వెంట ఆమె భర్త విక్కీ కౌశల్, సోదరుడు సెబాస్టియన్‌తో పాటు ఇలియానా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కత్రినా ఫ్యామిలీతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్‌లో ఇలియానా కనిపించడంతో.. కథనాలు మొదలయ్యాయి. కత్రినా కైఫ్ అన్న సెబాస్టియన్ తో ఇలియానా డేటింగ్ చేస్తోందని, అందుకే వాళ్లతో కలిసి మాల్దీవులకు వెళ్లిందంటూ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!