గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `దేవదాసు` వంటి హిట్ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించి, `పోకిరి`తో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ బ్యూటీ.. తన జోరో సైజ్ నడుముతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్లో కెరీర్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న తరుణంలో ఇలియానా మనసు బాలీవుడ్ వైపు మల్లింది.
అయితే తనదైన టాలెంట్‌తో ఇలియానా అక్కడ అక్కడ అవకాశాలు దక్కించుకుంది. కానీ, సక్సెస్ మాత్రం కాలేకపోయింది. ఈమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ తర్వాత ఆమెకు సౌత్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. బాలీవుడ్ లో కూడా ఈమెను ఎవరూ పట్టించుకోలేదు.
ఇదే సమయంలో ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ తో ఇలియానా ప్రేమలో పడింది. ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. కానీ, వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసుండలేక.. బ్రేకప్ చెప్పుకున్నారు. బ్రేకప్ నుంచి చాలా కాలానికి బయట పడిన ఇలియానా.. మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి సినిమా ఆఫర్లు కోసం ఎదురుచూస్తోంది.
అయితే ఎవరూ ఆమెను పట్టించుకోకపోవడంతో.. ఇలియానా కీలక నిర్ణయం తీసుకుని డిజిటల్ అరంగేట్రానికి రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరిష్మా కోహ్లీ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోయే ఈ సిరీస్‌ను అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియా సంస్థలు నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ అయినా ఇలియానా కెరీర్ కు కలిసొస్తుందేమో చూడాలి.