21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News సినిమా

ఆ స్టార్ హీరోయిన్ సోద‌రుడితో ఇలియానా పెళ్లి.. షాపింగ్ కూడా షురూ అట‌!?

Share

గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరోయిన్ సోద‌రుడితో అని అంటున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైలో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ.. `దేవదాసు` మూవీతో గ్రాండ్ గా సినీ కెరీర్ ను ప్రారంభించి అన‌తి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

దాదాపు ద‌శాబ్దం పాటు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నించింది. అక్కడ ఆఫ‌ర్లు అయితే వ‌చ్చాయి కానీ.. విజ‌యం మాత్రం వ‌రించ‌లేదు. అదే స‌మ‌యంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో సహజీవనం చేస్తూ కెరీర్ గురించి ఆలోచించ‌డం మానేసింది.

ileana marriage
ileana marriage

దీంతో ఆమెకు ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయి. మ‌రోవైపు ఆండ్రూతో కూడా ఆమె ఎక్కువ కాలం క‌లిసుండ‌లేక‌పోయింది. వీరిద్ద‌రూ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ బ్రేక‌ప్ నుంచి చాలా కాలానికి బ‌య‌ట ప‌డిన ఇలియానా.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్ తో రిలేషన్ షిప్ లో ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

రీసెంట్‌గా మాల్దీవుల్లో జ‌రిగిన క‌త్రినా బ‌ర్త్‌డే వేడుక‌ల్లో సెబాస్టియన్ తో పాటు ఇలియానా కూడా హాజర‌వ‌డం.. ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. అయితే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తాజాగా ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇరు కుటుంబ‌స‌భ్యులు అంగీక‌రించ‌డంతో.. సెబాస్టియన్ తో క‌లిసి ఇలియానా పెళ్లి షూటింగ్ కూడా షురూ చేసింద‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

 


Share

Related posts

Hero Ram:`ది వారియ‌ర్‌`పై రామ్ కాన్ఫిడెన్స్‌.. అందుకే ఆ ప‌ని చేశాడా?

kavya N

Samantha: అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడు ఏదైనా చేయ‌గ‌ల‌ను.. స‌మంత షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Ram Charan: మిస్ వరల్డ్ కోరిక రామ్ చరణ్ తీరుస్తాడా? ఉపాసన దానికి ఒప్పుకుంటుందా?

Ram