Krishna: సూపర్ స్టార్ కృష్ణ శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఈరోజు ఉదయం హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు ఉదయం వార్తలు వైరల్ రావడం తెలిసిందే. దీంతో కృష్ణ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు వైద్యులు మరియు కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కృష్ణ ఆరోగ్యం పై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఆయనకు గుండెపోటు రావడంతో నిన్న రాత్రి రెండు గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చారని కాంటినెంటల్ వైద్యులు తెలియజేయడం జరిగింది.
ఈ క్రమంలో ఆయనకు సిపిఆర్ తో పాటు అన్ని పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని.. 24 గంటలు గడిస్తే గాని కృష్ణ ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆయనను బతికించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మళ్ళీ కృష్ణ ఆరోగ్యంపై ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ వద్దనే ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మహేష్ దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. కృష్ణ ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు అన్ని విషయాలు వైద్యులని అడిగి తెలుసుకుంటున్నారట.
ఈ ప్రకటనతో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు కృష్ణనీ చూడటానికి ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మహేష్ ని పరామర్శిస్తూ మీడియాకి కనపడకుండా ఆసుపత్రి వెనకవైపు నుంచి వచ్చి వెళ్తున్నారట. వైద్యుల ప్రకటనతో మరోపక్క అభిమానులు కృష్ణ ఆరోగ్యంగా కోలుకుని బయటకు రావాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో మహేష్ అన్నయ్య రమేష్, తల్లి ఇందిరాదేవి మరణించడం తెలిసిందే. ఈలోపే కృష్ణ హాస్పిటల్ లో జాయిన్.. కావటంతో.. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!