Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాలుగో వారం రతిక ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ నీ చాలామంది ఆడియన్స్ ఎంజాయ్ చేయడం జరిగింది. సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటివారం అద్భుతమైన గేమ్ ఆడిన కంటెస్టెంట్ గా రతిక.. గుర్తింపు సంపాదించిన గాని తరువాత ఆమె ఇంటి సభ్యులతో వ్యవహరించిన తీరు చూసే ఆడియన్స్ కి ఫేక్ గేమ్ అనిపించింది. ఒకళ్ళ దగ్గర ఒకలాగా మరొక వ్యక్తి దగ్గర ఇంకో రకంగా డబల్ గేమ్ ఆడి.. చాలా నెగెటివిటీ ఇంప్రెషన్ సంపాదించింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో ఆడిన ఆట తీరు చాలా డ్యామేజ్ తీసుకురావడం జరిగింది.
వెళ్లి పోయే వారం నాలుగో వారంలో పల్లవి ప్రశాంత్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా తక్కువ చేసి రతిక మాట్లాడిన తీరు నాలుగో వారం ఆమె ఓటింగ్ గ్రాఫ్ తల క్రిందలను చేయడం జరిగింది. చివర ఆఖరికి ఎలిమినేట్ అయిపోయింది. అంత త్వరగా ఎలిమినేట్ కావడం రతిక కూడా ఊహించలేకపోయింది. ఇదిలా ఉంటే నాలుగో వారం హౌస్ నుండి బయటికి వచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ పరంగా మాత్రం రతికకి భారీగా ముట్టినట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున రతికకి ఏమినరేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సో ఈ లెక్క పట్టి చూస్తే నాలుగు వారాలకు 8 లక్షల రూపాయల వరకు తీసుకుందని తెలుస్తోంది. మరోపక్క కచ్చితంగా రతికకి హౌస్ లోకి వెళ్లే అవకాశం బిగ్ బాస్ కల్పిస్తారని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆమెకు తన మంచి ఎవరు కోరుకుంటున్నారో .. తెలియని పరిస్థితి హౌస్ లో నెలకొందని ఇంకో ఛాన్స్ ఆమెకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్ లో 10 మంది ఉన్నారు. నాలుగు వారాలకు నలుగురు ఎలిమినేట్ కావడంతో ఈ పదిమందితో పాటు మరి కొత్త ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.