18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Best Thriller Movies Telugu 2022: అమితంగా ఆదరణ పొందిన ఉత్తమ తెలుగు థ్రిల్లర్ జానర్‌ సినిమాలు 2022 | బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ టు బిన్జ్ ఇన్ డిసెంబర్

Best Thriller Movies Telugu 2022
Share

Best Thriller Movies Telugu 2022: ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రంగానికి ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. బాహుబలి 2, RRR సృష్టించిన రికార్డులకు టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు సినీ ప్రపంచంలో మారుమొగుతుంది. దీంతో తెలుగు సినిమా అంటే ఎగబడి మరి చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక దేశంలో సైతం తెలుగువారితో పని చేయడానికి వివిధ ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు కూడా ముందుకు వస్తున్నారు. గతానికి ప్రస్తుత పరిస్థితికి చాలా మార్పులు కనిపించాయి.

Best Thriller Movies Telugu 2022
Best Thriller Movies Telugu 2022

భయానకం, హింసాత్మకం, బీభత్సం – మసూద మూవీ రివ్యూ: Masooda Movie Review

బాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు హీరోలు నిర్మాణ సంస్థల సైతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పనిచేయటానికి ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు విడుదల కావడం జరిగాయి. వాటిలో కొన్ని బోల్తాపడగా మరికొన్ని విజయం సాధించాయి. అయితే థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో వచ్చిన బెస్ట్ తెలుగు సినిమాల…లిస్ట్ వైపు ఓ లుక్ వేద్దాం.

Best Thriller Movies Telugu 2022: Karthikheya 2
Best Thriller Movies Telugu 2022: Karthikheya 2

Iravatham Review : OTT లో ‘ఐరావతం’ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఇదొక పెద్ద అవమానం.

ముందుగా సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి కాంబినేషన్ లో వచ్చిన “డీజే టిల్లు”. క్రైమ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఓ కామెడీ కథగా.. ఆడియన్స్ ని ఆకట్టుకుంది. నెక్స్ట్ “బొమ్మలు కొలువు” మూవీ. రఘువరన్ బీటెక్ లో ధనుష్ తమ్ముడిగా నటించిన రిషికేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి ఏప్రిల్ నెలలో రిలీజ్ అయింది. కరోనా టైములో మృతుల కుటుంబాలు పడిన బాధలు భావోద్వేగాలను చూపిస్తూ తెరకెక్కించడం జరిగింది. కానీ కథకు తగ్గ నిర్మాణ విలువలు లేకపోవడం సినిమాకి మైనస్ కావటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Best Thriller Movies Telugu 2022: Yashooda
Best Thriller Movies Telugu 2022: Yashooda

Repeat: ఓటీటీ రిపీట్ రివ్యూ.! హిట్టా.!? ఫట్టా.!?

ఈ రీతిగా విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కార్తికేయ 2, శాకినీ డాకిని, ఫోకస్, Dr.56, తగ్గేదేలే, యశోద, హిట్ 2. వీటన్నిటిలో “కార్తికేయ 2” పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి రికార్డ్ లు సృష్టించింది. కనీసం థియేటర్ లు  దొరుకుతాయా లేదా అన్న పరిస్థితుల్లో ఆగస్టు 13వ తారీకు విడుదలైన ఈ సినిమా… కొన్ని వందల కోట్లను లాభం తెచ్చి పెట్టింది. నిఖిల్, అనుపమ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఆ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన “యశోద”.. నవంబర్ 11 వ తారీకు విడుదలయ్యి అద్భుతమైన విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కావటంతో సమంత కెరీర్ లో “యశోద”.. రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది.

Best Thriller Movies Telugu 2022: Hit 2
Best Thriller Movies Telugu 2022: Hit 2

HIT 2 Movie Review: అడవి శేష్ “హిట్ 2” మూవీ రివ్యూ..!!

ఇంకా మరో సినిమా విషయానికొస్తే రీసెంట్ గా విడుదలైన “హీట్ 2”. 2020వ సంవత్సరంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన “హిట్” సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “హిట్ 2” సూపర్ డూపర్ హిట్ అయింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను రెండో భాగాన్ని అడవి శేష్ హీరోగా.. నాని నిర్మాణ దర్శకత్వంలో చిత్రీకరించడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో.. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలు రాబడుతున్న సినిమాగా జోరు చూపిస్తుంది.

Best Thriller Movies 2022 Telugu Saakini Daakini
Best Thriller Movies 2022 Telugu Saakini Daakini

ఈ తరహాలోనే రెజీనా, నివేదా థామస్ నటించిన “శాకిని డాకిని”..సెప్టెంబర్ నెలలో విడుదలై…కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. శిక్షణ కోసం పోలీస్ అకాడమీలో చేరిన ఇద్దరు యువతులుగా రెజీనా, నివేదా థామస్.. కనిపిస్తారు. కిడ్నాప్ నేపథ్యంలో కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా పెద్దగా అంతగా ఏమీ ఆకట్టుకోలేకపోయింది. కాస్తా కామెడీగా పర్వాలేదనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాది బెస్ట్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన తెలుగు  సినిమాలు కార్తికేయ 2, హీట్ 2, యశోద అని చెప్పవచ్చు. ఏడాది ప్రారంభంలో కరోనా ఎఫెక్ట్ ఉండటంతో తర్వాత మెల్లమెల్లగా విడుదలైన సినిమాలలో.. అనేకమైనవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ ఈ మూడు సినిమాలు మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి.
India Lockdown Movie Review: ఆసక్తి రేకెత్తించి తుస్సుమనిపించిన ‘ఇండియా లాక్‌డౌన్’ మూవీ.. శ్వేతా బసు ప్రసాద్ కోసం ఓసారి చూడొచ్చు!


Share

Related posts

మరింత ఆలస్యంగా ఎన్టీఆర్- కొరటాల ప్రాజెక్ట్..??

sekhar

Kajal agarwal : కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసిషన్..వాళ్ళు ఫుల్ హ్యాపీ..!

GRK

Pawan Kalyan: రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా..??

sekhar