NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చే పేరు రామ్ పోతినేని. సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ రామ్ తన ప్రతిభతో సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు. అమ్మాయిలకు ఆల్ టైం ఫేవరెట్ హీరో అయ్యాడు. అటువంటి రామ్ పోతినేని పుట్టినరోజు నేడు‌. దీంతో అభిమానులు, సినీప్రియులు సోషల్ మీడియా ద్వారా రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. బ‌ర్త్ డే సందర్భంగా రామ్ పోతినేని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1988 మే 15న హైదరాబాదులో మురళి మోహన్ పోతినేని, పద్మశ్రీ దంపతులకు రామ్ జన్మించాడు. అతనికి కృష్ణ చైతన్య అనే ఒక బ్రదర్ తో పాటు మధు స్మిత అనే సిస్టర్ కూడా ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ రామ్ పోతునేనికి పెదనాన్న అవుతారు. తమిళనాడులో చెన్నైలో చదువుకున్న రామ్.. 2022లో అడియాళం అనే తమిళ షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. అప్పటికి 11 ఏళ్ల వయసులో ఉన్న రామ్.. అడియాళం షార్ట్ ఫిల్మ్‌లో మత్తు పదార్థాలకు బానిస అయిన 18 ఏళ్ల కుర్రాడి పాత్రను పోషించి మొదటిసారి స్క్రీన్ పై కనిపించాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌కి గానూ రామ్ యూరోపియన్ మూవీస్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకోవడం మరొక విశేషం.

2006లో వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు సినిమాతో రామ్‌ టాలీవుడ్ లోకి హీరోగా అడుగు పెట్టాడు. ఇదే సినిమాతో ఇలియానా కూడా కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. దేవదాసు చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో రామ్ కెరీర్ కు పూల బాటను పరిచింది. అలాగే నటించిన తొలి సినిమాతోనే సిల్వర్ జూబ్లీ గా ఆడడం టాలీవుడ్ లో మొదట రామ్ కు మాత్రమే చెల్లింది. దేవదాసు అనంతరం జగడం, రెడీ, మాస్క్, గణేష్‌, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, ఎందుకంటేప్రేమంట.. ఇలా జయప‌జయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేశాడు. టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్నాడు.

2019లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో ఉన్న రామ్‌.. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా అవతరించాడు. మాస్‌ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఓవైపు క్లాస్ హీరోగా మరోవైపు మాస్ హీరోగా రాణిస్తున్న రామ్.. డబుల్ ఇస్మార్ట్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వల్ గా పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

నేడు రామ్ బ‌ర్త్‌డే సందర్భంగా విడుదలైన డ‌బుల్‌ ఇస్మార్ట్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రామ్‌ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 36 ఏళ్ళు వచ్చిన ఇంకా ఆయన సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. గతంలో పలువురు హీరోయిన్ల‌తో రామ్ ప్రేమాయణం నడిపిస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అవి చివ‌ర‌కు పుకార్లుగానే మిగిలాయి. ఇక‌ రామ్ కు ఇండస్ట్రీలో దివంగత నటీమణులు శ్రీదేవి, సౌందర్య అంటే ఎంతో అభిమానం. ఫుడ్ పరంగా చూస్తే రామ్ బిర్యానీ లవర్. లండన్, ప్యారిస్ ఆయ‌న ఫేవరెట్ ప్లేసెస్‌. టాలీవుడ్ లో హీరో శర్వానంద్, రామ్ బంధువులు. రామ్ పోతినేని అక్క మధుస్మిత.. శర్వానంద అన్న కళ్యాణ్‌ పెళ్లి చేసుకున్నారు. అలా ఈ హీరోలిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది.

Related posts

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N