BrahmaMudi:బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ పాత్రలో నటిస్తున్న మానస్. ఈ సీరియల్ లో రాజ్ అద్భుతంగా నటిస్తూ ప్రేక్షక ఆదరణ పొందుతున్నాడు. మనస్ సీరియల్ తో పాటు విరామం దొరికినప్పుడల్లా కొన్ని స్టేజ్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇస్తున్నాడు. మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనంలోనే సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్న రాజ్. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఒక సినిమాకి సైన్ చేసి ఆ సినిమా మధ్యలో ఆగిపోవడంతో రాజ్ ఇక సినిమాలతో కాదనుకొని బుల్లితెరన్ నమ్ముకొని బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు. కోయిలమ్మ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన మానస్ ఆ తర్వాత ఇక చాలా సీరియల్స్ లో నటించి తెలుగు అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ చేస్తూ, స్టార్ మా లో ఇచ్చిన పరివార్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు మానస్.

ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈటీవీలో కూడా ఎంట్రీ ఇచ్చాడు మానస్. అవును ఈటీవీలో దీవాలి కి ప్రసారమయ్యే, ప్రోగ్రాంలో మానస్ ఒక పాటకి డాన్స్ చేస్తున్నాడు. ఈటీవీలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అని దీవాలి కి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం ని కండక్ట్ చేస్తున్నారు. శ్రీముఖి ఈటీవీలో ఈ షోలో యాంకర్ గా మన ముందుకు రాబోతుంది. ఈటీవీలో ఇప్పటిదాకా రష్మీ లేదంటే అనసూయ యాంకర్లుగా చూసాము ఇప్పుడు శ్రీముఖి యాంకర్ గా ఈ షోలో మనందరినీ అలరించనుంది. ఇక ఈ షో లో స్పెషల్ గెస్ట్ గా సుమ,మంచు మనోజ్, సుమా కొడుకు రోషన్, కనిపించి అలరించనున్నారు.

ఈ షోలో ఎప్పటిలాగా ఆది, ఆటో రాంప్రసాద్ పంచులు, వాటితో పాటు వర్షిని, పాటలు పాడడానికి రఘు కుంచే, అలాగే డాన్స్ చేయడానికి పండు, ఇలా చాలామందితో ఈ ప్రోగ్రాం దీపావళికి మనందరినీ అలరించడానికి సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేశారు అందులో మానస్ శ్రీ సత్య తో కలిసి మన్మధ రాజా పాటకి డాన్స్ చేస్తూ, ఎనర్జిటిక్ స్టెప్పులతో అలరించనున్నాడు. మానస్ ఈ పాటలో బ్లాక్ డ్రెస్ లో, శ్రీ సత్య కూడా బ్లాక్ డ్రెస్ లో, స్టెప్పులు వేసి, ఆడియన్స్ ని మెప్పించనున్నారు. ఈ ప్రోమో ని మీరు ఒకసారి చూసేయండి.
